ETV Bharat / bharat

శరద్​ పవార్​కు అనారోగ్యం​.. ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స.. ఏం జరిగింది?

ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. ముంబయిలో బ్రీచ్​ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల పాటు ఆయన చికిత్స పొందనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Sharad Pawar admitted to Breach Candy Hospital

author img

By

Published : Oct 31, 2022, 1:18 PM IST

Sharad Pawar Health: ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్​ పవార్​ అనారోగ్యానికి గురయ్యారు. మూడు రోజుల పాటు ఆయన ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ మూడు రోజులపాటు ఆయన పాల్గొనబోయే పార్టీ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

మూడు రోజుల చికిత్స అనంతరం నవంబర్ 3న ఆసుపత్రి నుంచి శరద్​ పవార్​ తన ఇంటికి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగబోయే ఎన్​సీపీ క్యాంపునకు ఆయన హాజరవుతారని తెలిపాయి.
గత ఏడాది ఏప్రిల్‌లో శరద్ పవార్ పిత్తాశయ సమస్య కారణంగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయనకు మూడు సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Nationalist Congress Party chief Sharad Pawar admitted to Breach Candy Hospital
ఎన్సీపీ కార్యాలయం నుంచి విడుదలైన లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.