ETV Bharat / bharat

ప్రైవేటు వైద్యవిద్య ఫీజులకు ఎన్​ఎంసీ మార్గదర్శకాలు

author img

By

Published : May 26, 2021, 6:42 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల ఫీజుల నిర్ధరణకు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసింది. ఫీజులను నిర్ణయించే ముందు విద్యాసంస్థను లాభాపేక్ష లేకుండా నడుపుతున్నామన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది. అనవసర ఖర్చులను జత చేయకూడదని తెలిపింది. ఇంకా ఎన్​ఎంసీ ఏమేం చెప్పిందంటే..

nmc, national medical commission
వైద్య విద్య

దేశంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల ఫీజుల నిర్ధరణకు జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మంగళవారం ముసాయిదా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 10(1)(ఐ)ని అనుసరించి ఇందుకోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపింది. వీటిపై సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే legal@nmc.org.in కి కేవలం ఈమెయిల్‌ ద్వారా మాత్రమే పంపాలని స్పష్టం చేసింది. ఎంతలోపు ఇవి పంపాలన్న గడువును మాత్రం చెప్పలేదు.

  • ఏ రూపంలోనూ కేపిటేషన్‌ ఫీజు వసూలు చేయకూడదు.
  • ఫీజులను నిర్ణయించే ముందు విద్యాసంస్థను లాభాపేక్ష లేకుండా నడుపుతున్నామన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అందువల్ల సంస్థ నిర్వహణకు అయ్యే ఖర్చులను మాత్రమే ఫీజుల్లో చేర్చాలి. అనవసర వ్యయాలు, లాభాలను వీటితో జతచేర్చకూడదు.
  • కాలేజీ నిర్వహణ ఖర్చులను గత ఏడాది ఆడిట్‌ లెక్కల ప్రకారం మాత్రమే నిర్ధరించాలి.
  • పాత కాలేజీలతో పోలిస్తే కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలకు వడ్డీలు, తరుగుదల, వేతనాల భారం అధికంగా ఉంటుంది. తొలి ఏడాది ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్లు అందుబాటులో ఉండవు. అందువల్ల కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలు తాత్కాలిక ప్రాతిపదికన ఫీజులు నిర్ధరించాలి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కాలేజీల ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్ల ఆధారంగా రుసుములు ఖరారు చేయాలి. గత ఏడాది కొవిడ్‌ కారణంగా హాస్టళ్లు మూసేసినందున కొన్ని ఖర్చులు తగ్గి ఉంటాయి. అందుల్ల 2020-21 ఆడిట్‌ లెక్కలు వాస్తవాన్ని ప్రతిబింబించే అవకాశం లేదు. అలాంటి సమయంలో రాష్ట్ర రుసుముల నియంత్రణ ప్రాధికార సంస్థ గత మూడేళ్ల సగటు ఖర్చులను పరిగణనలోకి తీసుకొని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఫీజులను నిర్ణయించవచ్చు.
  • కాలేజీలో చేరబోయే మొత్తం ఎంబీబీఎస్‌, పీజీ విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఒక్కో విద్యార్థిపై పెట్టే ఖర్చులు లెక్కించాలి.
  • ఫీజులను మూడేళ్లకు ఒకేసారికానీ, సంవత్సరం ప్రాతిపదికనకానీ నిర్ణయించవచ్చు. విద్యార్థి తొలి ఏడాది చేరిన సమయంలో ఉన్న ఫీజులే అతని చదువు పూర్తయ్యేంత వరకు ఉండాలి. వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా గరిష్ఠంగా 5% వరకు ద్రవ్యోల్బణాన్ని జతచేయొచ్చు.
  • పీజీ విద్యార్థుల ఫీజులు నిర్ధరించేటప్పుడు బోధనా సిబ్బందికి చెల్లించే వేతనాలను, పీజీ కోర్సుల కోసం మాత్రమే చేసే ఇతరత్రా ఖర్చులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఎంబీబీఎస్‌, పీజీ విద్యార్థులకు ఉమ్మడిగా సేవలందించే బోధన, బోధనేతర సిబ్బందిపై పెట్టే ఖర్చులను మాత్రం మొత్తం విద్యార్థుల సంఖ్య ఆధారంగా విభజించాలి.
  • ఫీజుల నిర్ధరణ సమయంలో మూలధన వ్యయం కోసం షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ప్రమోటర్లు, ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీలను తీసుకోకూడదు.
  • బ్యాంకుల నుంచి కేవలం మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రులకోసం తీసుకున్న రుణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ ఈ రుణాలను పూర్తిగాకానీ, కొంత భాగం కానీ ఇతరత్రా అవసరాలకు మళ్లించి ఉంటే ఆ భాగంపై చెల్లించే వడ్డీని ఫీజుల నిర్ధరణ కోసం పరిగణనలోకి తీసుకోకూడదు.
  • పీజీ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ఫీజు నిర్ధరించుకునే అధికారాన్ని కాలేజీలకే వదిలిపెట్టాలి. అయితే పీజీ కోర్సులన్నింటి నిర్వహణకయ్యే ఖర్చు... విద్యార్థుల నుంచి వసూలుచేసే ఫీజులకు మించకుండా చూసుకోవాలి. పీజీ విద్యార్థులకు చెల్లించే స్టైఫండ్‌ను ఆసుపత్రి వ్యయం కింద గుర్తించాలి. దాన్ని కాలేజీ నిర్వహణ వ్యయం కింద పరిగణించి పీజీ ఫీజులకు జతచేయకూడదు.
  • కొన్ని రాష్ట్రాల్లో ఫీజు నిర్ధరణ సంస్థలు ఎంబీబీఎస్‌, ఇతర కోర్సులకు కాలేజీల వారీగా నిర్ధారిస్తే, మరికొన్ని రాష్ట్రాల్లో అక్కడున్న అన్ని కాలేజీల సగటు వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని ఏకాభిప్రాయం ప్రాతిపదికన ఫీజులను నిర్ణయిస్తున్నారు. ఒకవేళ ఫీ రెగ్యులేటరీ అథారిటీ రాష్ట్ర మొత్తం ఒకే ఫీజు నిర్ణయించాలనుకుంటే అలా చేయొచ్చు. అయితే దానికి కాలేజీలు ఏకాభిప్రాయం వ్యక్తంచేయాలి. దానివల్ల విద్యార్థులపై అనవసరంగా ఆర్థికభారం పడకూడదు.
  • ఒకవేళ ఏ రాష్ట్రంలోనైనా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 50%కి మించిన సీట్లు గవర్నమెంటు కోటా, రాయితీ ఫీజుల కింద ఉంటే ఆ కోటాను అలాగే కొనసాగించాలి. స్టేట్‌ ఫీ రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోని ప్రైవేటు వైద్యకళాశాలలకు వర్తించే నిబంధనలే డీమ్డ్‌ యూనివర్సిటీలకూ వర్తింపజేయాలి. అందుకు తగ్గట్టు స్టేట్‌ ఫీ రెగ్యులేషన్‌ యాక్ట్‌లో సవరణలు చేయాలి.

ప్రైవేటు ఎంబీబీఎస్‌, పీజీ కోర్సుల ఫీజుల నిర్దారణకు ఎన్‌ఎంసీ జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు...

  • వైద్యవిద్య ఫీజులను నిర్ధారించే సమయంలో బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలను పరిగణలోకి తీసుకోవాలి. క్లినికల్‌ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు, మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందిస్తుంటే వాళ్లు ఎక్కడ ఎంత సేపు పనిచేస్తున్నారన్న ఆధారంగా వారి వేతనాలను ఆసుపత్రి, వైద్యకళాశాలల ఖర్చుల కింద విభజించాలి. ఉద్యోగులను గ్రేడ్‌ ఎ, బి, సి, డిలుగా గుర్తించి, దాని ప్రకారమే వేతనాలను అనుమతించాలి.
  • ఆసుపత్రి ఖర్చులన్నింటినీ వైద్యవిద్య ఖర్చుల కింద చూపకూడదు. ఒకవేళ ఎక్కడైనా మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న వైద్యకళాశాల సొంతంగా నడవలేని పరిస్థితిలో ఉందని స్టేట్‌ ఫీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయిస్తే దాని నిర్వహణకయ్యే ఖర్చులో 20% మొత్తాన్ని మాత్రమే మెడికల్‌ కాలేజీ నిర్వహణ ఖర్చు కింద పరిగణించాలి. రెగ్యులేటరీ అథారిటీ అన్ని లెక్కలను పక్కగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. యూజర్‌ ఫీజులు, ఇతరత్రా ఫీజుల ద్వారా ఆసుపత్రి ఖర్చులు తిరిగి వస్తున్న పక్షంలో ఆ వ్యయాన్ని మెడికల్‌ కాలేజీ నిర్వహణ ఖర్చుల కింద చూపి ఫీజులో జతచేయడానికి వీల్లేదు.
  • గ్రాంట్లు, ఎయిడ్‌, డొనేషన్ల ద్వారా భవనాలు, ఇతర ఆస్తులు సృష్టించి ఉంటే వాటిపై పెట్టిన ఖర్చులను ఫీజుల కోసం లెక్కలోకి తీసుకోరాదు.
  • విద్యార్థుల నుంచి ఏదైనా నష్టం జరిగితే తిరిగి రాబట్టుకోవడం కోసం అన్ని ప్రైవేటు కాలేజీలు ముందుగా విద్యార్థులనుంచి కాషన్‌ డిపాజిట్‌ కట్టించుకొనివారు తిరిగి వెళ్లే సమయయంలో తిరిగి చెల్లిస్తుంటాయి. అంతవరకు ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తుంటాయి. వీటిపై వచ్చిన వడ్డీ ఆదాయాన్ని కాలేజీ నిర్వహణ ఖర్చుల నుంచి మినహాయించాలి. అందువల్ల ఫీజులు నిర్ధారించే సమయంలో ఈ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి డిపాజిట్ల గురించి కాలేజీలు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
  • వైద్యకళాశాల విస్తరణ కోసం డెవలప్‌మెంట్‌ ఫీజు కింద నిర్వహణఖర్చులో 6 నుంచి 15% వరకు మాత్రమే జతచేయొచ్చు. ఈ నిధులను కాలేజీ విస్తరణకోసం తప్ప మరే అవసరాలకూ ఉపయోగించకూడదు. ఇందుకోసం ప్రత్యేక ఖాతా తెరిచి అందులో ఆ మొత్తాన్ని జమచేయాలి. ఈ మొత్తంపై వచ్చే వడ్డీని కాలేజీ నిర్వహణ ఖర్చుల కింద పరిగణించకూడదు.
  • హాస్టల్‌, మెస్‌, ట్రాన్స్‌పోర్ట్‌, లైబ్రరీ, ఎగ్జామినేషన్‌ ఫీజులు... ఆ సేవల కోసం చేసే వాస్తవ ఖర్చుల ప్రాతిపదికనే ఉండాలి.
  • హాస్టల్‌ అద్దె ఆ మున్సిపాల్టీపరిధిలోని రెంటల్‌ వాల్యూ ప్రకారం ఉండాలా, లేదంటే ఇంకా ఎక్కువైనా ఉండొచ్చా అని నిర్ధారించే అధికారాన్ని స్టేట్‌ ఫీ రెగ్యులేటరీ అథారిటీకే వదిలిపెట్టాలి.

ఇదీ చూడండి: తమిళనాడులో ఆందోళనకర స్థాయిలో కరోనా

ఇదీ చూడండి: పరీక్షల రద్దు కోరుతూ సీజేఐకి విద్యార్థుల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.