కర్ణాటకలో జాతీయ రహదారిని అతి వేగంగా నిర్మించి.. ఔరా అనిపించారు అధికారులు. సొల్లాపుర్- విజయ్పుర్ మధ్య 22.54 కిలో మీటర్ల జాతీయ రహదారి పనులను కేవలం 18 గంటల్లోనే పూర్తి చేశారు. దాంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది.
కేంద్ర రోడ్డు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవిందా ఎం.కరాజోలా, ఎంపీ రమేశ్ జిగాజినాగి నేతృత్వంలోని బృందం.. ఈ నిర్మాణ పనులను ప్రారంభించింది. కేవలం 18 గంటల వ్యవధిలోనే అధికారులు దీన్ని పూర్తి చేయగా.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు.
ఈ రోడ్జు పనులను జాతీయ రహదారి ప్రాధికార సంస్థ నిర్వహించింది. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కరాజోలా ప్రశంసించారు. నిర్మాణ పనుల్లో పాల్గొన్న బృందాన్ని అభినందించారు.