Narendra Modi Shirdi Visit Video : 2014కు ముందు దేశంలో ఎక్కడ చూసినా అవినీతికి సంబంధించిన లెక్కలే వినిపించేవని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్ మంత్రంతో పని చేస్తోందని మహారాష్ట్ర పర్యటనలో తెలిపారు. ప్రజల సంక్షేమమే డబుల్ఇంజిన్ సర్కారు ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో.. పేదల సంక్షేమ బడ్జెట్ సైతం పెరుగుతోందని తెలిపారు.
-
#WATCH | Ahmednagar, Maharashtra: Prime Minister Narendra Modi says "...Even before 2014, you used to hear figures, but what were those figures? Corruption worth so many lakhs, corruption worth so many crores, scam worth so many lakhs of crores and what is happening now?..." pic.twitter.com/A7xDqaJ8WF
— ANI (@ANI) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Ahmednagar, Maharashtra: Prime Minister Narendra Modi says "...Even before 2014, you used to hear figures, but what were those figures? Corruption worth so many lakhs, corruption worth so many crores, scam worth so many lakhs of crores and what is happening now?..." pic.twitter.com/A7xDqaJ8WF
— ANI (@ANI) October 26, 2023#WATCH | Ahmednagar, Maharashtra: Prime Minister Narendra Modi says "...Even before 2014, you used to hear figures, but what were those figures? Corruption worth so many lakhs, corruption worth so many crores, scam worth so many lakhs of crores and what is happening now?..." pic.twitter.com/A7xDqaJ8WF
— ANI (@ANI) October 26, 2023
"2014కు ముందు మీకు తరచుగా అంకెలు వినిపించేవి. అన్ని రూ.లక్షల స్కామ్ జరిగింది. ఇన్ని రూ.కోట్ల స్కామ్ జరిగిందని వినేవారు. ఇప్పుడేమైంది? పేదల కోసం వెచ్చించే బడ్జెట్ పెరుగుతోంది. మహారాష్ట్రలోనే 1.10 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చాం. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. మనమందరం కలిసి 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కలసికట్టుగా పనిచేయాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మహారాష్ట్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మద్‌నగర్ జిల్లాలోని నిల్వండే డ్యామ్‌కు జల పూజలు చేసిన ఆయన.. ఆనకట్ట ఎడమ కాలువ నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. 85 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆనకట్ట ఎడమ కాలువ నెట్వర్క్ ద్వారా 182 గ్రామాలకు మంచి నీరు అందనుంది. నిల్వండే డ్యామ్ నిర్మాణానికి 1970లో ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.5,177 కోట్ల వ్యయంతో డ్యామ్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
-
#WATCH | Prime Minister Narendra Modi says "...Our government is following the mantra of Sabka Saath Sabka Vikas. The highest priority of our double Indian government is the welfare of the poor. Today, when the country's economy is growing, the government's budget for the welfare… pic.twitter.com/BlDRBPK7uq
— ANI (@ANI) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi says "...Our government is following the mantra of Sabka Saath Sabka Vikas. The highest priority of our double Indian government is the welfare of the poor. Today, when the country's economy is growing, the government's budget for the welfare… pic.twitter.com/BlDRBPK7uq
— ANI (@ANI) October 26, 2023#WATCH | Prime Minister Narendra Modi says "...Our government is following the mantra of Sabka Saath Sabka Vikas. The highest priority of our double Indian government is the welfare of the poor. Today, when the country's economy is growing, the government's budget for the welfare… pic.twitter.com/BlDRBPK7uq
— ANI (@ANI) October 26, 2023
అదేసమయంలో, కుర్దువాడీ-లాతూర్ రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను మోదీ ప్రారంభించారు. జలగావ్ నుంచి భూసవాల్ ప్రాంతాలను కలిపే రెండు రైల్వే రైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులను సైతం మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలో 86 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగించే నమో షెట్కరీ మహా సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించారు మోదీ.
PM Modi Shirdi Puja : అంతకుముందు.. శిర్డీలోని సాయిబాబాను ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అనంతరం సాయిబాబాను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని వెంట మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్, సీఎం ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, దేవస్థానం ప్రతినిధులు ఉన్నారు.
PM Modi Uttarakhand Visit : ఆదికైలాశ్ను దర్శించుకున్న మోదీ.. పార్వతి కుండ్‌లో స్వయంగా పూజలు
Ayodhya Ram Mandir Modi : 'అయోధ్యకు ఆహ్వానం అందింది.. రాముడి విగ్రహ ప్రతిష్ఠ చూడడం నా అదృష్టం'