ETV Bharat / bharat

తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: నారా లోకేశ్ - నారా లోకేశ్ సభ

Nara Lokesh Comments at Yuvagalam Closing Meeting: మూడు నెలల్లో ప్రజాస్వామ్య పవర్‌ ఏంటో జగన్‌కి చూపించాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమేనని, తాడేపల్లి తలుపు బద్దలు కొట్టేవరకు ఈ యుద్ధం ఆగదని లోకేశ్ స్పష్టం చేశారు. విజనరీ నాయకుడు చంద్రబాబు, పవర్‌పుల్‌ నాయకుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు రాష్ట్రానికి కావాలన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 20, 2023, 7:37 PM IST

Updated : Dec 21, 2023, 6:33 AM IST

తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు యుద్ధం ఆగదు: నారా లోకేశ్

Nara Lokesh Comments at Yuvagalam Closing Meeting: యువగళం ముగింపు సభ కాదు, ఆరంభం మాత్రమే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. ఇది నవశకం, యుద్ధం మొదలైందని, ఈ యుద్ధం తాడేపల్లి తలుపులు బద్ధలు కొట్టే వరకు ఆగదని యువగళం ముగింపు సభలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుందని కానీ, రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని లోకేశ్ వెల్లడించారు. యువగళం, మనగళం, ప్రజాగళం అన్న లోకేశ్, బాంబులకే భయపడమని పిల్ల సైకోలకు భయపడతామా అంటూ వైఎస్సార్​సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

విజయవంతమైన 'యువగళం-నవశకం" భారీ బహిరంగ సభ

విజనరీ అంటే చంద్రబాబు జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరని, తనది అంబేడ్కర్‌ రాజ్యాంగ పౌరుషం అని లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు, పవన్‌ను చూస్తే జగన్‌ భయపడతారని, అందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని లోకేశ్ ఆరోపించారు. విజనరీ అంటే చంద్రబాబు, ప్రిజనరీ అంటే జగన్‌ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ అరెస్టయితే రోజుకో స్కాం బయటపడేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం జగన్‌ దెబ్బతీశారని లోకేశ్ విమర్శించారు. జగన్ తాను పేదవాడిగా చెప్పుకుంటున్నారని, రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచిన వ్యక్తి పేదవాడు అవుతారా అంటూ లోకేశ్ ప్రశ్నించారు. మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్‌ ఏంటో చూపాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్​సీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి: చంద్రబాబు

అరగంట స్టార్‌ అంబటి: జగన్‌ అహంకారం, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతుందని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త పథకం తెచ్చారని, ప్రజలు మాత్రం వైఎస్సార్​సీపీ నేతలు తమ జీవితాలతో ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు. జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు 'కోడి కత్తి వారియర్స్‌' అని, కోడికత్తి వారియర్స్ ఆటగాడు అవినాష్‌ రెడ్డి అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌, అరగంట స్టార్‌ అంబటి అని లోకేశ్ వైఎస్సార్​సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. గంట స్టార్‌ అవంతి, ఆల్‌ రౌండర్‌ గోరంట్ల మాధవ్‌ అంటూ విమర్శించారు. రీల్‌ స్టార్‌ భరత్‌, పించ్‌ హిట్టర్‌ బియ్యపు మాధవరెడ్డి అంటూ వైఎస్సార్​సీపీ నేతలపై లోకేశ్ ఆరోపణలు చేశారు.

వైఎస్సార్​సీపీ పాలనలో ఏపీ అంధకారం - మన భవిష్యత్​ను మనమే నిర్మించుకోవాలి: పవన్‌ కల్యాణ్

అమరావతిని పూర్తి చేసే బాధ్యత: రాజధానిని చంపి జగన్‌ రాక్షసానందం పొంతున్నారని లోకేశ్ విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం అమరావతిని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. గోదావరి జిల్లాలోని ఆక్వా రంగం, వరి, కొబ్బరి రైతులను జగన్ నాశనం చేశారని లోకేశ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సీమను స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దుతామని లోకేశ్ తెలిపారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతామని లోకేశ్ తెలిపారు.

స్టీల్‌ ప్లాంటు భూములు కొట్టేసేందుకు స్కెచ్‌: ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఒక్క ఇటుక వేయలేదని లోకేశ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గాడి తప్పిన ఉత్తరాంధ్రను సరైన మార్గంలో పెడతామని లోకేశ్ తెలిపారు. స్టీల్‌ ప్లాంటు భూములు కొట్టేసేందుకు స్కెచ్‌ వేశారని, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని వెల్లడించిన లోకేశ్, వైఎస్సార్​సీపీ ఎంపీలు ఏనాడు విశాఖ ఉక్కు కోసం పోరాడలేదని విమర్శించారు. వైఎస్సార్​సీపీ నిర్లక్ష్యం వల్లే విశాఖ ఉక్కును మూసివేసే పరిస్థితికి చేరుకుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎన్నడూ చూడని విధంగా విశాఖను తయారు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

సమయం లేదు మిత్రమా - విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం: బాలకృష్ణ

Last Updated : Dec 21, 2023, 6:33 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.