Nannamma Superstar Samanvi death: కన్నడ బుల్లితెర నటి అమృతా నాయుడు కుమార్తె సమన్వీ(6) గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. టీవీ రియాలిటీ షో 'నన్నమ్మ సూపర్‌స్టార్'లో చైల్డ్ కంటెస్టెంట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సమన్వీ.

బెంగళూరుకు చెందిన అమృతా నాయుడు తన కుమార్తె సమన్వీతో కలిసి గురువారం షాపింగ్‌కి వెళ్లారు. సాయంత్రం షాపింగ్ ముగించుకుని స్కూటీపై ఇంటికి బయలుదేరారు. నగరంలోని కొనాంకుంటే క్రాస్ వద్ద వారి ద్విచక్ర వాహన్ని ఓ టిప్పర్ లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై పడిపోయిన సమన్వీ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన అమృతా నాయుడుని ఆసుపత్రికి తరలించారు.

కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్లో టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదైంది. డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: