ETV Bharat / bharat

నందిగ్రామ్ రణం: రోజంతా వార్​ రూమ్​లోనే దీదీ! - మమతా బెనర్జీ

బంగాల్‌లో రెండోదశ పోలింగ్ జరుగుతోంది. కీలక స్థానం నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ, సువేందు అధికారి అమీతుమీ తలపడుతున్నారు. అయితే.. తమ ఎన్నికల ఏజెంట్లను కొన్ని పోలింగ్​ కేంద్రాల్లోకి అనుమతించట్లేదని, ఓటర్లను భయపెడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సీఎం రోజంతా నందిగ్రామ్​లోనే ఉండి పోలింగ్​ తీరును పర్యవేక్షించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Mamata to stay for whole day
ఏజెంట్లకు బెదిరింపులు- రోజంతా నందిగ్రామ్​లోనే దీదీ!
author img

By

Published : Apr 1, 2021, 11:39 AM IST

బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి ఇవాళ ఎన్నిక జరుగుతున్న నందిగ్రామ్​ నియోజకవర్గంలోనే రోజంతా ఉండనున్నారు. పోలింగ్​ తీరును సమీక్షించనున్నారు. ఉత్తర​ బంగాల్​లో ప్రచారం కోసం వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. ఆమె నిర్ణయం మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పోలింగ్​ ముగిసేవరకు ఇక్కడే రేయపాడా ప్రాంతంలోని పార్టీ వార్​ రూమ్​లో ఉండి పర్యవేక్షిస్తారని, అవసరమైతే ఓటింగ్​ కేంద్రాలకు వెళతారని ఓ సీనియర్​ నేత తెలిపారు.

నందిగ్రామ్​లో భాజపా అభ్యర్థి సువేందు అధికారితో తలపడుతున్నారు మమత. ఈ కీలక స్థానంలో హోరాహోరీ పోరు జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇక్కడ పోలింగ్​ జరుగుతోంది.

'ఏజెంట్లనూ అనుమతించట్లేదు'

కొన్ని పోలింగ్​ కేంద్రాల్లోకి తమ ఎన్నికల ఏజెంట్లను అనుమతించట్లేదని టీఎంసీ​ నేతలు ఆరోపిస్తున్నారు. నందిగ్రామ్​లోని పలు కేంద్రాల్లో తమ ఏజెంట్లను.. భాజపా భయపెడుతోందని, ఓటర్లనూ అడ్డుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది.

ఇదీ చూడండి: నందిగ్రామ్​లో ఓటు వేసిన సువేందు అధికారి

ఈ నేపథ్యంలోనే.. మమత ఈ రోజు నందిగ్రామ్​లోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'నందిగ్రామ్'​ సమరంలో విజేత ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.