ETV Bharat / bharat

YS Sharmila: షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు - వైఎస్​ షర్మిలకు రిమాండ్

Sharmila
Sharmila
author img

By

Published : Apr 24, 2023, 9:38 PM IST

Updated : Apr 24, 2023, 10:05 PM IST

19:33 April 24

YS Sharmila: షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

YS Sharmila arrested: పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో ఇవాళ అరెస్టయిన వైఎస్​ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్​ విధించింది. ఈ కేసులో ఆమెకు 14రోజులు రిమాండ్​ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఆమె బెయిల్​ పిటిషన్ వేయగా.. విచారణ రేపటికి వాయిదా వేశారు. దీంతో ఆమెను చంచల్​గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అంతకు ముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆమెను ప్రవేశపెట్టారు. షర్మిల తరపున వాదించిన న్యాయవాది.. నోటీసులివ్వకుండానే షర్మిలను అడ్డుకున్నారని కోర్టుకు వివరించారు. హైకోర్టు చెప్పినా షర్మిలను బయటికు వెళ్లనివ్వట్లేదని అన్నారు. షర్మిల విషయంలో పోలీసులు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారని కోర్టులో వాదించారు. షర్మిలను ఎస్ఐ తాకే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసులు ఆమె.. చేయి విరిచే ప్రయత్నం చేశారని కోర్టుకు వివరించారు. పోలీసులు కొట్టారు.. ఆ క్రమంలోనే షర్మిల పోలీసులు తోసేశారని అన్నారు.

పోలీసుల తరపున వాదించిన న్యాయవాది.. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారని అన్నారు. పోలీసులపై చేయిచేసుకుంటే తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. వేగంగా కారు పోనివ్వాలని షర్మిల డ్రైవర్‌కు సూచించారని వివరించారు. దీంతో కారు తగిలి కానిస్టేబుల్ కాలుకు గాయమైందని కోర్టులో వాదించారు. గతంలో ఆమెపై కేసులు ఉన్నాయని వివరించారు.

ఇది జరిగింది: ఉదయం బయటకు వెళ్తున్న షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిపై వైఎస్​ షర్మిల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు.. షర్మిలపై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. ఆమెపై సెక్షన్​ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటుగా 337, రెడ్‌విత్ 34, మరో రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అనంతరం జూబ్లీహిల్స్​ స్టేషన్​లో ఉన్న తమ కుమార్తెను చూడడానికి వెళ్లిన వైఎస్​ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళ కానిస్టేబులపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెను బలవంతంగా పోలీసులు కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించారు. షర్మిలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగులు గురించి తన బిడ్డ పోరాడుతుంటే ఆమెను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ప్రశ్నించే గొంతును, వైఎస్​ షర్మిల స్వేచ్ఛ హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని అన్నారు.

ఇవీ చదవండి:

YS Sharmila : లోటస్​ పాండ్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల

YS Vijayamma: న్యాయం ప్రశ్నించే గొంతుకను ఆపేస్తారా?: విజయమ్మ

తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు అసమంజసం.. సీబీఐకి నిబంధనలు పెట్టడం సరికాదు : సుప్రీం

Last Updated : Apr 24, 2023, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.