భాజపా జాతీయ కార్యదర్శులతో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 5, 6 తేదీల్లో జరిగే ఈ భేటీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలు, అప్పటివరకు పాటించాల్సిన విధివిధానాలపై జాతీయ కార్యదర్శులకు మార్గనిర్దేశనం చేయనున్నారు నడ్డా.
ప్రస్తుత కొవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు వ్యూహాలతో పాటు పార్టీ ప్రారంభించిన సేవా హి సంఘటన్ కార్యక్రమంపైనా సమావేశంలో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ప్రదర్శనపైనా సమావేశం దృష్టిసారించనున్నట్లు వెల్లడించాయి.
కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు 2022లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎన్నికల సన్నద్ధతపై వ్యూహాలతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. వీటితో పాటు పార్టీ చేపడుతున్న ఇతర సేవా కార్యక్రమాలపైనా నడ్డా సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.
ఇవీ చదవండి-