భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్త యాత్రలో భాగంగా బంగాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పార్టీ శ్రేణులతో భేటీ కానున్నారు. అనంతరం కోల్కతా సహా మరో తొమ్మిది జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
"బంగాల్లో రౌడీ రాజ్యపాలన జరుగుతుందని అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూ.. 'ఇక అన్యాయం జరగదు' అనే నినాదంతో కార్యకర్తలకు భరోసా ఇవ్వనున్నారు నడ్డా. దీనిలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తర్వాత కాళీమాత ఆలయంలో జరగనున్న ప్రత్యేక పూజలో పాల్గొంటారు" అని పార్టీ నేతలు తెలిపారు.
అయితే వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.
అన్ని ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా 120 రోజుల యాత్రను ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభించారు. ఆ రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటించిన నడ్డా.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉత్తరాఖండ్ నుంచి నడ్డా దేశవ్యాప్త పర్యటన షురూ..