కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారుడు తిరస్కరించాడు. ఈ అమానుష ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది.
ఇటీవల కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన బాధితుడు మృతిచెందాడు. మృతదేహాన్ని కుమారుడికి అప్పగించేందుకు నగర పాలక సంస్థ సభ్యుడు కేవీ శ్రీధర్ అతడిని సంప్రదించారు. అయితే తండ్రి మృతి పట్ల స్పందన వ్యక్తం చేయని అతడు.. 'మీరే అంత్యక్రియలు నిర్వహించండి. నాకు మాత్రం ఆయన వద్ద ఉన్న ఆరు లక్షలు ఇప్పించండి' అని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి : వ్యాక్సిన్ వద్దని నదిలో దూకి పరార్!