అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. బైడెన్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు మోదీ.
"అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్‌కు హృదయపూర్వక అభినందనలు. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామాన్ని బలోపేతం చేసేందుకు.. ఆయనతో కలిసి పనిచేసేందుకు నేను ఎదురుచూస్తున్నా."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
వెంకయ్య..
అగ్రరాజ్య అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం స్వీకారం చేసిన జో బైడెన్, కమలా హారిస్‌లకు అభినందనలు తెలిపారు భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు భాగస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయన్న ఆయన.. రాబోయే కాలంలో ఈ బంధం కచ్చితంగా బలపడుతుందని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలపై దిగొచ్చిన కేంద్రం