ETV Bharat / bharat

సీతల్​కుచి ఆడియో క్లిప్​.. ముదిరిన వివాదం - సీతల్​ కుచి కాల్పులు

సీతల్​కుచి ఘటనకు సంబంధించి భాజపా విడుదల చేసిన ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఇరు పార్టీల నాయకుల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఓ వైపు ఈ ఆడియోను పరిశీలించాలని భాజపా ప్రతినిధి బృందం.. ఎన్నికల సంఘాన్ని కోరగా, ఇది బూటక చర్య అని ముఖ్యమంత్రి మమత అభివర్ణించారు. తన ఫోన్​ ట్యాప్​ చేస్తున్నారని.. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు.

mamata on bjp phone tapping
కూచ్ బిహార్ ఆడియో క్లిప్
author img

By

Published : Apr 17, 2021, 5:03 PM IST

సీతల్​కుచి కాల్పుల ఘటనకు సంబంధించి భాజపా విడుదల చేసిన ఆడియో క్లిప్.. వివాదాస్పదంగా మారింది. బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్వరంతో ఉన్న ఆడియో క్లిప్‌ను పరిశీలించాల్సిందిగా స్వాపన్‌ దాస్‌ గుప్త నేతృత్వంలోని భాజపా ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కోరింది. మమత వ్యాఖ్యలు పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉద్రిక్తతను ప్రేరేపించేలా ఉన్నాయని బంగాల్‌ ఎన్నికల ప్రధాన అధికారి అప్తాబ్‌కు భాజపా నేతలు వివరించారు. కూచ్​బిహార్ కాల్పుల్లో చనిపోయిన బాధితుల మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని సీతల్‌కుచి అభ్యర్థితో మమత మాట్లాడినట్లు ఆడియోలో ఉంది.

'ముఖ్యమంత్రి ఫోన్​ ట్యాప్ చేస్తున్నారు'

అయితే ఈ ఆడియో క్లిప్‌ను భాజపా తయారు చేసిన బూటకపు క్లిప్‌గా టీఎంసీ కొట్టిపారేసింది. ముఖ్యమంత్రి ఫోన్​ను సైతం భాజపా ట్యాప్​ చేస్తోందని ఆరోపించారు మమతా బెనర్జీ. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు. ఈ ఘటనలో భాగమైన ఎవ్వరినీ వదిలిపెట్టనన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తృణమూల్ కాంగ్రెస్​తో భాజపా సమానం కాదన్నారు.

కూచ్​బిహార్​ కాల్పులపై రిపోర్టుకు ఈసీ ఆదేశం

కూచ్​బిహార్ కాల్పుల​ ఘటనకు సీఐఎస్​ఎఫ్​ బలగాలే కారణమంటూ.. స్థానిక ప్రజలు ఆరోపిస్తున్న క్రమంలో, ఈ ఘటనపై రిపోర్టు అందించాలని ఎన్నికల పరిశీలకులను ఈసీ ఆదేశించింది.

ఇదీ చదవండి : సీఐడీ చేతికి సీతల్​​కుచి కాల్పుల కేసు

సీతల్​కుచి కాల్పులు: మమత ఆడియో కలకలం!

'బంగాల్​లో బలగాలపై దాడి దీదీ పనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.