ETV Bharat / bharat

'నా అరెస్ట్​ కోసం ప్రధాని కార్యాలయం కుట్ర.. 56 అంగుళాల పిరికితనం!' - జిగ్నేశ్ మేవాణి న్యూస్​

Jignesh Mevani On BJP: గుజరాత్​ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే భాజపా ప్రభుత్వం తనను అరెస్ట్​ చేయించిందని ఆరోపించారు ఆ రాష్ట్ర శాసనసభ్యుడు జిగ్నేశ్​ మేవాణి. దీనిని ఓ పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

Jignesh Mevani On BJP
Jignesh Mevani On BJP
author img

By

Published : May 2, 2022, 3:51 PM IST

Jignesh Mevani On BJP: గుజరాత్​ శాసనసభ్యుడు జిగ్నేశ్​ మేవాణి భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనను అసోం పోలీసులు అరెస్ట్​ చేయాలని ప్రధానమంత్రి కార్యాలయ కుట్ర పన్నిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తనను అరెస్ట్​ చేశారని.. దీనిని '56 అంగుళాల పిరికిపంద చర్య'గా ఆయన అభివర్ణించారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే 56 అంగుళాల ఛాతి ఉండాలంటూ గతంలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇలా అన్నారు జిగ్నేశ్.

'మహాత్మా దేవాలయం'గా భావించే గుజరాత్​లో శాంతి సామరస్యం కోసం మోదీ పిలుపునివ్వాలనే తాను ట్వీట్​ చేశానని చెప్పారు. వారు గాడ్సే భక్తులు కాకపోతే ఎర్రకోట నుంచి 'గాడ్సే ముర్దాబాద్​' అనాలని సవాల్​ చేశారు. తీవ్రవాది అని ట్వీట్​ చేసినందుకు తనను అరెస్ట్ చేయడంలో భాజపాకు ప్రయోజనం లేదని.. గుజరాత్​ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొనే కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని మేవాణి అన్నారు.

గుజరాత్​లో పట్టుబడిన రూ.1.75 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్, 22 పరీక్ష పత్రాల లీక్​కు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. జూన్​1న వీధుల్లోకి వచ్చి గుజరాత్​ బంద్​ను నిర్వహిస్తానని మేవాణి ప్రకటించారు. మైనారిటీలు, దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. తన అరెస్టు చేయాలని అసోం పోలీసులు కుట్ర పన్నారని.. శాసనసభ్యుడిగా తన ప్రోటోకాల్​ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు.

తన అరెస్ట్ విషయం తెలియదన్న అసోం ముఖ్యమంత్రి హిమంత​ బిశ్వ శర్మ వాదనపై మేవాణి స్పందించారు. అసోం ముఖ్యమంత్రికి తన అరెస్ట్ గురించి​ తెలియకపోవడం అసాధ్యమని.. ఆయన రాజకీయ గురువుల సూచనతోనే తనపై కేసులు నమోదు చేశారని చెప్పారు. తనపై ఫిర్యాదు చేయమని మహిళా పోలీసులపై ఉన్నతాధికారులే ఒత్తిడి తెచ్చారని.. ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.

ఇదీ చదవండి: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్! టార్గెట్​ 2024!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.