ETV Bharat / bharat

సర్జరీ విఫలమైన 15 మంది కళ్లు తొలగింపు- ఎన్​హెచ్ఆర్​సీకి ఫిర్యాదు - ముజఫర్​పుర్ కేటరాక్ట్ సర్జరీ కేసు

Muzaffarpur cataract surgery fail: కేటరాక్ట్ ఆపరేషన్లు విఫలమైన ఘటనలో 15 మంది బాధితుల కళ్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరోవైపు, వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.

muzaffarpur cataract surgery fail
muzaffarpur cataract surgery fail
author img

By

Published : Dec 2, 2021, 12:54 PM IST

Muzaffarpur eye lost case update: బిహార్ ముజఫర్​పుర్​లో కేటరాక్ట్ సర్జరీలు విఫలమైన ఘటనలో 15 మందికి కంటిచూపు పోయింది. వీరి కళ్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. మరికొంతమంది బాధితులు ఎస్​కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

Muzaffarpur cataract surgery fail:

అన్ని ఆపరేషన్లను ఆస్పత్రి వైద్యుడు ఎన్​డీ సాహూ నిర్వహించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో ఈ విషయాన్ని ఒప్పుకున్నారని సమాచారం. ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత నలుగురికి సమస్యలు తలెత్తగా.. వారి కళ్లను తొలగించారు. ఈ విషయాన్ని తొలుత ఆస్పత్రి దాచి ఉంచిందని తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి డీఎం, సివిల్ సర్జన్​కు సైతం సమాచారం అందించలేదు.

Muzaffarpur hospital operation theatre sealed

ఈ విషయంపై మాట్లాడిన సివిల్ సర్జన్ డాక్టర్ వినయ్ శర్మ.. ఘటనపై పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. బాధితులందరి సమాచారాన్ని ఆస్పత్రి తమకు అందించలేదని చెప్పారు. కంటి ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్​కు దర్యాప్తు టీమ్ సీల్ వేసిందని తెలిపారు.

"ఎస్​కేఎంసీఎచ్​లో బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ నుంచి సేకరించిన నమూనాలను ఎస్​కేఎంసీఎచ్​లో పరీక్షిస్తున్నాం. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది."

-డాక్టర్ వినయ్ శర్మ, సివిల్ సర్జన్

Muzaffarpur eye hospital news

జిల్లాలోని జురాన్ ఛాప్రా ప్రాంతంలో ఉన్న కంటి ఆస్పత్రిలో నవంబర్ 22న కేటరాక్ట్ ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ సమయంలోనే పదుల సంఖ్యలో బాధితులు చికిత్స చేయించుకున్నారు. ఆ రోజు ఆపరేషన్ చేయించుకున్న వారికి కంటి సమస్యలు తలెత్తాయి. వారం రోజుల తర్వాత కూడా తమకు నయం కాలేదని బాధితులు వాపోయారు. దీనిపై ఆస్పత్రి వైద్యులను సంప్రదిస్తే ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారని వివరించారు. కంటిని తీసేయించకపోతే మరో కన్నుకూ ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు హెచ్చరించారని చెప్పారు.

Muzaffarpur eye surgery case NCHRC:

తాజాగా, ఈ విషయం జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్​హెచ్ఆర్​సీ) వద్దకు చేరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్​కే ఝా అనే న్యాయవాది బిహార్ మానవ హక్కుల సంఘంతో పాటు ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు చేశారు. పట్నా హైకోర్టు, సుప్రీంకోర్టుకు సైతం లేఖలు రాశారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఓ వైద్యుడు ఒక రోజులో 12కన్నా ఎక్కువ ఆపరేషన్లు నిర్వహించకూడదని ఆయన పేర్కొన్నారు. కానీ ఆస్పత్రి స్టేట్​మెంట్​ ప్రకారం నవంబర్ 22న 65 మందికి సర్జరీలు నిర్వహించారని చెప్పారు. ఇది దర్యాప్తు చేయాల్సిన అంశమని అన్నారు.

ఇదీ చదవండి: రెసిడెన్షియల్​ కాలేజ్​లో 33మంది బాలికలకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.