ETV Bharat / bharat

'సింహా' స్టైల్ మీసంపై మోజు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్

Mustache Police Suspension: సింహా సినిమాలో బాలయ్య మీసాల స్టైల్​ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాదాపు అదే తరహా మీసాలతో విధులకు హాజరైన ఓ పోలీసు కానిస్టేబుల్​ను అధికారులు సస్పెండ్​ చేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

mp-cop-grows-hair-and-moustache-suspended-for-indiscipline
పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్
author img

By

Published : Jan 9, 2022, 7:12 PM IST

'సింహా' స్టైల్ మీసంపై మోజు.. పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్

Mustache Police Suspension: మధ్యప్రదేశ్​ భోపాల్​లో ఓ పోలీసు కానిస్టేబుల్​ను అధికారులు సస్పెండ్ చేశారు. జుట్టు, మీసాలు కత్తిరించమని పై అధికారులు ఆదేశించినప్పటికీ వినలేదని.. విధుల నుంచి తప్పించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.

సస్పెండ్​ అయిన రాకేశ్​ రాణా.. డిపార్ట్​మెంట్​లో మోటార్​ వెహికల్​ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రాణాను సస్పెన్షన్ ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం దర్శనం ఇచ్చాయి. పోలీసు శాఖలో అసిస్టెంట్​ ఇన్​స్పెక్టర్​ జనరల్​గా పని చేస్తున్న.. ప్రశాంత్​ శర్మ ఈ ఉత్తర్వులను ఇచ్చినట్లు రాణా తెలిపారు. జుట్టు, మీసాలు కత్తిరించకపోవడం వల్లనే విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

రానా మెడ వరకు మీసాలు, జుత్తుతో విధులు హాజరయ్యారని, వాటిని కత్తిరించమని చెప్పినప్పటికీ వినకపోవడం వల్ల వేటు పడిందని ఏఐజీ ప్రశాంత్​ శర్మ తెలిపారు. యూనిఫాం వేసుకున్న ఏ వ్యక్తి కూడా అటువంటి వేషధారణతో విధులకు హాజరుకారని స్పష్టం చేశారు.

ఈ విషయంపై తగ్గేదేలే...

వేటు వేయడం పై కానిస్టేబుల్​ రాణా స్పందించారు. పొడవుగా పెంచిన మీసాలను తగ్గించేది లేదని స్పష్టం చేశారు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. చాలా కాలంగా మీసాలను పెంచుతున్నానని తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదంటున్నారు. అధికారులు చెప్పినట్లుగా తాను ఎప్పుడూ యూనిఫాం లేకుండా రాలేదని తెలిపారు.

ఇదీ చూడండి: ట్రాన్స్​జెండర్​ భిక్షాటనతో కిక్​బాక్సింగ్​లో శిక్షణ- జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.