ETV Bharat / bharat

పేరు మార్చుకుని ప్రేమ అంటూ మోసం.. పెళ్లి చేసుకోవాలని వీడియోలతో బ్లాక్​మెయిల్​.. చివరకు.. - Muslim youth deception in the name of love

ఓ యువకుడు తన పేరు మార్చుకుని ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. నిజాన్ని తెలుసుకున్న బాధితురాలు అతడిని దూరం పెట్టగా.. ఆమె ప్రైవేట్​ వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడు.

muslim-youth-cheated-hindu-girl-by-changing-name-in-up

author img

By

Published : Dec 12, 2022, 9:00 PM IST

Updated : Dec 12, 2022, 9:08 PM IST

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ యువకుడు తన పేరు మార్చుకుని అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు. అసలు విషయం తెలిసిన తర్వాత బాధితురాలు అతడిని దూరం పెట్టడం వల్ల ఆమె ప్రైవేట్​ వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్​ ఆల్మోరా జిల్లాకు చెందిన బాధితురాలు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. అదే ప్రాంతంలోని మరో కంపెనీలో పనిచేస్తున్న హసీన్​ షఫీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కానీ తన పేరు ఆశిష్​​ ఠాకుర్​గా ఆమెకు చెప్పాడు. కొద్దిరోజులకే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో అదే ప్రాంతంలో రూమ్​ అద్దెకు తీసుకుని వీరిద్దరూ ఉంటున్నారు.

ఓ రోజు షఫీ తండ్రి అదే ప్రాంతానికి వచ్చాడు. అక్కడి స్థానికులతో మాట్లాడాడు. అప్పుడు వారందరికీ ఆశిష్​.. షఫీ అని తెలిసింది. ఈ విషయాన్ని బాధితురాలికి చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు షఫీని దూరం పెట్టింది. ఇక అప్పటి నుంచి షఫీ.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే తన దగ్గర ఉన్న ప్రైవేట్​ వీడియోలు వైరల్​ చేస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Dec 12, 2022, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.