ఛఠ్ పూజ... ప్రసిద్ధ హిందూ పండుగల్లో ఒకటి. దీనిని బిహార్ సహా ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వైభవంగా జరుపుకుంటారు. ఈ పూజలో భాగంగా మట్టిపొయ్యి మీద కుండల్లో వండిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. పూజలో మట్టి పొయ్యి, కుండ చాలా ముఖ్యం. అయితే అటువంటి మట్టి పొయ్యిలను స్థానికంగా ఉండే ముస్లిం మహిళలు తయారు చేస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నారు.
తగ్గిన అమ్మకాలు
దశాబ్దాలుగా పండుగ వేళలో.. ముస్లిం మహిళలు మట్టిపొయ్యిలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కరోనా కారణంగా ఈసారి అమ్మకాలు తగ్గిపోయాయి. ఫలితంగా తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు.
ఇదీ చూడండి: ఉత్తర భారతంలో వైభవంగా 'ఛఠ్ పూజ'