ETV Bharat / bharat

హిందూ మహిళ అంత్యక్రియల్లో ముస్లింలు - జమ్ముకశ్మీర్​ బందిపొరా జిల్లా వార్తలు

మతాల కంటే మానవత్వమే గొప్పదని చాటి చెప్పే సంఘటన జమ్ముకశ్మీర్​లో జరిగింది. కశ్మీర్​ పండిట్​ మహిళ మృతిచెందగా ఇరుగుపొరుగున ఉన్న ముస్లింలు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తమ భుజాలపై పాడె మోస్తూ తీసుకెళ్లారు.

Muslim perform last rites of hindu
హిందువుల అంత్యక్రియల్లో ముస్లింలు
author img

By

Published : Jun 5, 2021, 8:17 PM IST

జమ్ముకశ్మీర్​లోని ముస్లింలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన ఓ మహిళ అంత్యక్రియలను వారు శుక్రవారం నిర్వహించారు. ఈ సంఘటన ఉత్తర కశ్మీర్​లోని బందిపొరా జిల్లాలో జరిగింది.

Muslim perform last rites of hindu
రాణిభట్​కు నివాళి అర్పిస్తున్న ముస్లింలు

బందిపొరాలోని అజర్​ ప్రాంతానికి చెందిన రాణి భట్​ అనే మహిళ గురువారం రాత్రి కన్నుమూసింది. ఆమె భర్త కాశీనాథ్​ భట్​ కూడా గతంలో చనిపోయారు. రాణిభట్ మరణ​ వార్త విని ఆమె ఇంటి చుట్టుపక్కల ఉన్న ముస్లింలు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు.

Muslim perform last rites of hindu
రాణిభట్​ పాడె మోస్తున్న ముస్లింలు
Muslim perform last rites of hindu
అంత్యక్రియల్లో ముస్లింలు

ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు..

తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొని ముస్లింలు తమకు సహాయం చేసినందుకు రాణిభట్ కుమారుడు వారికి ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాంతంలో ముస్లింల సంఖ్య ఎక్కువగానే ఉన్నా తాము ఏనాడూ ఒంటరిగా భావించలేదని చెప్పారు.

"నేను వీరందరి ఇళ్లకు ఇరుగుపొరుగున ఉన్నందుకు గర్వపడుతున్నాను. మేము కశ్మీర్​ను వదలి వెళ్లకుండా ఇక్కడే ఉన్నందుకు సంతోషంగా ఉంది. చాలా ఏళ్లుగా మేం ఇక్కడే నివసిస్తున్నాం. మామధ్య శాంతి, సోదరభావం ఉంది.

-రాణి భట్ కుమారుడు.

రాణిభట్​ పాడెను ముస్లింలు తమ భుజాలపై మోస్తూ శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అంతేగాకుండా మృతదేహం దహనానికి కావాల్సిన కలపను వారే ఏర్పాటు చేశారు. ఎంతో మంది రాణి భట్​ ఇంటికి విచ్చేసి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

Muslim perform last rites of hindu
హిందూ మహిళ అంత్యక్రియలు నిర్వహిస్తున్న ముస్లింలు
Muslim perform last rites of hindu
హిందు, ముస్లింల మతసామరస్యం

ఇదీ చూడండి: నివాసాల్లోకి మొసలి.. తాళ్లతో బంధించిన గ్రామస్థులు

ఇదీ చూడండి: మిద్దెపై అడవిని సృష్టించిన ప్రకృతి ప్రేమికుడు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.