ETV Bharat / bharat

బుల్లెట్​ ట్రైన్​ నుంచి రోప్​ వే వరకు.. ఈ ఊహా నగరంలో అన్నీ ఉన్నాయ్​!

ఆ నగరంలో స్టీమ్ ఇంజిన్​ రైళ్ల నుంచి బుల్లెట్​ ట్రైన్​ దాగా అన్ని రకాల రైళ్లు అటుఇటు తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సిగ్నల్స్​ లేని రోడ్లపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. అన్ని రకాల వినోదాలకు ఇక్కడ కొదవ లేదు. ఈ నగరం ఏ ఐరోపా దేశంలోనిదో కాదు.. ఉన్నది మన మహారాష్ట్రలోనే. ఆ నగర విశేషాలు ఓసారి చూద్దాం..

museum with imaginary city
మినియేచర్​ ట్రైన్​ మ్యూజియం
author img

By

Published : Mar 5, 2023, 3:33 PM IST

బుల్లెట్​ ట్రైన్​ నుంచి రోప్​ వే వరకు.. ఈ ఊహా నగరంలో అన్నీ ఉన్నాయ్​!

స్టీమ్ఇంజిన్​ రైలు నుంచి బుల్లెట్​ ట్రైన్ దాకా.. మోనో రైలు నుంచి మెట్రో దాకా అటుఇటు తిరుగుతూ అక్కడ కనువిందు చేస్తాయి. సిగ్నల్స్​ లేని అత్యాధునిక రోడ్లు, సొరంగాలు, ఫ్లైఓవర్లపై వాహనాలు దూసుకెళ్తాయి. అలా పక్కనే నీళ్లలో పరుగులు పెట్టే పడవలు, స్టీమర్లు... అందమైన కొండల అంచున రోప్​వేలు.. వినోదాలు పంచే హాట్​ ఎయిర్​ బెలూన్, రోలర్​ కోస్టర్, జెయింట్​ వీల్ రైడ్లు మనసును దోచేస్తాయి. ఇక రాత్రి అయితే గ్రహాలు, నక్షత్రాలు మిలమిల మెరుస్తూ.. కనువిందు చేస్తాయి. అయితే, ఇవన్నీ ఉన్నది ఏ ఐరోపా నగరంలోనో కాదు.. ఇండియాలోనే. అదీ ఓ ఊహా నగరంలో. మహారాష్ట్రలోని పుణెలో ఉందీ నగరం.

బాలకృష్ణ శంకర్​ అలియాస్​ భావూ జోషి అనే వ్యక్తికి రైలు ఇంజిన్ సూక్ష్మ రూపాలు తయారు చేయడమంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో.. వాటిని తయారు చేసేవాడు. అలా మొదలైన ఆయన ఆసక్తే.. మినియేచర్​ ట్రైన్​ మ్యూజియం ఏర్పాటుకు కారణమైంది. ఆ మ్యూజియంలోనే ఈ మినియేచర్ నగరం ఉంది. అందులో హైవేలు, పెద్ద పెద్ద భవంతులు.. వినోదం, విహారం కోసం పార్కులు, సర్కస్​ లాంటి వసతులన్నీ ఉన్నాయి. స్టీమ్ఇంజిన్ల నుంచి బుల్లెట్​ ట్రైన్​ వరకు అన్ని రైళ్లు.. ఆ నగరంలో ఉంటాయి. గృహ సముదాయాలు, ఫ్యాక్టరీలు కూడా ఉంటాయి ఈ ఊహా నగరంలో.

museum with imaginary city
మినియేచర్​ ట్రైన్​ మ్యూజియం
museum with imaginary city
మినియేచర్​ ట్రైన్​ మ్యూజియం

పుణెలో ఇంజినీరింగ్​ చదువుకున్న భావూ జోషి.. ఆ సమయంలో రైళ్ల నమూనాలు తయారు చేసేవాడు. అతడి ప్రతిభ గుర్తించి పలువురు ప్రశంసించేవారు. అయితే ఆ కాలంలో ఆట వస్తువులు, బొమ్మలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే చాలా కష్టం అయ్యేది. దీంతో జోషి.. స్వతహాగా మినియేచర్​ రైళ్లను తయారు చేసేవాడు. కాగా, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్​ వెళ్లిన జోషి.. చదువుతో పాటు తన హాబీకి పదును పెట్టాడు. అక్కడ రైలు ఇంజిన్​ మ్యూజియాలను సందర్శించేవాడు. అలా కొన్ని రైలు ఇంజిన్ల కలెక్షన్​ సంపాదించాడు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఆ కలెక్షన్​తో ప్రదర్శన నిర్వహించాడు. ఆ ప్రదర్శన.. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఆకర్షించడం వల్ల.. వాటిని కొనసాగించాడు. అలా 1998లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశాడు. ఇక భావూ జోషి చనిపోయిన తర్వాత ఆ మ్యూజియాన్ని.. ఆయన కుమారుడు రవి జోషి నిర్వహిస్తున్నారు. గత పదేళ్లుగా రవి జోషి నిర్వహిస్తున్న ఈ రైలు ఇంజిన్​ సూక్ష్మ రూపాల వ్యాపారం క్రమక్రమంగా పెరుగుతోంది.
మినియేచర్​ రైళ్లు మాత్రమే కాకుండా.. కొన్ని మినియేచర్​ యంత్రాలను కూడా జోషి తయారు చేశారు. సరదా హాబీలు వేళ్లూనుకుని.. దేశంలో సృజనాత్మకత పెరగాలని ఆకాంక్షిస్తున్నట్టు రవి జోషి తెలిపారు.-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.