ETV Bharat / bharat

33 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన అత్యాచార బాధితురాలు.. - మహారాష్ట్రలో అత్యాచార ఘటన

మహారాష్ట్రలో సెప్టెంబర్​ 9న అత్యాచారానికి గురైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఈ రోజు ఉదయం కన్నుమూసింది. ఆమెను బతికించడానికి వైద్యులు అనేక ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి.

Woman raped in maharastra
నిర్భయ
author img

By

Published : Sep 11, 2021, 1:56 PM IST

Updated : Sep 11, 2021, 2:57 PM IST

మహారాష్ట్ర ముంబయిలోని సకినాకలో అత్యంత ఆటవికంగా అత్యాచారానికి గురైన మహిళ.. చివరికి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. సుమారు 33 గంటలపాటు తీవ్రమైన క్షోభను అనుభవించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమెను బతికించడానికి వైద్యులు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. 34 ఏళ్ల గల ఈ మహిళపై తన వాహనంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు మోహన్​ చౌహాన్ అనే కిరాతకుడు. అంతటితో ఆగక.. మహిళ ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్​ను దూర్చి చిత్రహింసలకు గురిచేశాడు.

ఏం జరిగిందంటే..?

శుక్రవారం ఉదయం ఖైరానీ రోడ్డు సమీపంలో ఓ మహిళ రక్తపు మడుగులో పడిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళపై గురువారం.. అత్యాచారం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు.

పోలీసుల కస్టడిలో నిందితులు...

నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం ఈ నెల 21 వరకు పోలీస్​ కస్టడీనిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.

మరోవైపు అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. బాధితురాలికి వేగంగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టం చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి: మళ్లీ బతికొస్తాడని గంటలపాటు బురదలోనే మృతదేహం!

Last Updated : Sep 11, 2021, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.