కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన వారాంతపు లాక్‌డౌన్‌తో ముంబయి నగరం బోసిపోయి కనిపిస్తోంది. అనేక వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ ప్రాంతాలు.. జనసంచారం లేకుండా మారాయి.
శుక్రవారం సాయంత్రం 8 గంటలకు మొదలైన ఈ లాక్డౌన్.. సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-gate-way-of-india-7209886_10042021102613_1004f_1618030573_239.jpg)
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-gate-way-of-india-7209886_10042021102613_1004f_1618030573_330.jpeg)
లాక్డౌన్ ప్రభావంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ సమీపంలోని వీధులు, బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయం సమీపంలోని ప్రాంతాలు కళ తప్పాయి.
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11350259_111.jpg)
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11350259_222.jpg)
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11350259_333.jpg)
వారాంతపు లాక్డౌన్ కారణంగా ముంబయిలోని మెరెన్ డ్రైవ్ వెంబడి దారులన్నీ వెలవెలబోయాయి. మళ్లీ గతేడాది లాక్డౌన్ నాటి దృశ్యాలను గుర్తుకు తెస్తున్నాయి. అధికారులు ఈ ప్రాంతంలో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నిత్యావసరాలను సరఫరా చేసే వాహనాలకు మాత్రమే రోడ్లపైకి అనుమతినిస్తున్నారు.
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11350259_444.jpg)
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11350259_555.jpg)
![Mumbai under weekend lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11350259_66.jpg)
శుక్రవారం ముంబయిలో 9,200 కరోనా కేసులు వెలుగు చూశాయి. కొవిడ్ ధాటికి మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.