ETV Bharat / bharat

రూ.125 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత​ - mumbai nhava sheva

మహారాష్ట్ర నవీ ముంబయి పోర్టులో 25 కిలోల హెరాయిన్​ పట్టుబడింది. దీని విలువ రూ.125 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) తెలిపింది.

heroin seize
హెరాయిన్​ పట్టివేత
author img

By

Published : Oct 8, 2021, 12:49 PM IST

మహారాష్ట్ర నవీ ముంబయిలోని నావా షెవా పోర్టులో(Mumbai Nhava Sheva port) భారీగా మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) నిర్వహించిన తనిఖీల్లో ఓ కంటైనర్​లో 25 కిలోల హెరాయిన్(Mumbai drugs news)​ పట్టుబడింది. దీని విలువ రూ.125కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్​ చేసిన అధికారులు.. అక్టోబరు 11 వరకు కస్టడీలో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.

ఆగస్టులో రూ.1000 కోట్లు విలువైన డ్రగ్స్​ పట్టివేత

ఆగస్టు నెలలోనూ.. నవీ ముంబయిలోని పరిధిలోని ఓ పోర్టులో (Mumbai drug case latest news) 191 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముంబయిలో ఈ స్థాయిలో డ్రగ్స్​ పట్టుబడటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. వీటిని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను ముంబయి డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి

గతనెల గుజరాత్ ముంద్రా నౌకాశ్రయంలో రూ.21 వేల కోట్ల విలువైన 2,988.22 కిలోల హెరాయిన్​ (Mundra Port Drugs) స్వాధీనం చేసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. మనీలాండరింగ్, మాదకద్రవ్యాల రవాణ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.