ETV Bharat / bharat

ప్రియుడి బర్త్​ డే పార్టీకి వెళ్లిన అమ్మాయిపై గ్యాంగ్​ రేప్​! - tantrik rape in up

ప్రియుడిని నమ్మి బర్త్​డే పార్టీకి వెళ్లిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్త్​ ముంబయిలోని మల్వానీలో జరిగిన.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని స్థానిక పోలీసులు అరెస్ట్​ చేశారు.

16-year-old girl gang-raped, gang rape
గ్యాంగ్​ రేప్​
author img

By

Published : Jun 5, 2021, 7:45 PM IST

Updated : Jun 5, 2021, 8:08 PM IST

ప్రియుడి జన్మదిన వేడుకలకు వెళ్లిన 16 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిలో ఆరుగురిని అరెస్ట్​ చేశామని పేర్కొన్నారు. మరోకరు పరారీలో ఉన్నట్లు వివరించారు. ఈ ఘటన నార్త్​ ముంబయిలోని మల్వానీలో జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది..

నార్త్​ ముంబయిలో జరిగిన ప్రియుడు పుట్టినరోజుకు యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వెళ్లే సమయంలో తనను ఎవరూ అడ్డుకోకుండా ఇంటికి గొళ్లెం పెట్టింది. ప్రియుడి బర్త్​డే పార్టీకి చేరుకుంది. అక్కడ అతని స్నేహితులు, అతను కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల తరువాత ఆమెకు కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం తనపై జరిగిన బలాత్కారం గురించి, నిందితుల గురించి వివరించింది. దీనిపై పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఆరుగురిని పట్టుకున్న పోలీసులు.. మరోకరి కోసం గాలిస్తున్నారు.

తాంత్రికుడి పైశాచికం.. వివాహితపై అత్యాచారం

ఉత్తర్​ ప్రదేశ్​లోని బర్సనాలో నరేంద్ర అనే తాంత్రికుడు ఓ వివాహితపై అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో మంత్ర విద్యలను సాధన చేసేందుకు అతని శిష్యులతో కలసి వచ్చాడని తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ మహిళను రాత్రి సమయంలో తనను ఓ సారి కలవాలని కోరినట్లు చెప్పారు. తాంత్రికుడి మాటలు విన్న వివాహిత నిందితుని దగ్గరకు వెళ్లగా ఆమెపై అత్యాచారం చేసినట్లు వివరించారు.

దీనిపై వివాహిత బర్సనా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతని శిష్యుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: పోలీస్​ స్టేషన్​కు సమీపంలో బాంబు కలకలం!

Last Updated : Jun 5, 2021, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.