Mulayam Singh Yadav Health : ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన హరియాణాలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆదివారం ఆయనను ఐసీయూ వార్డుకు తరలించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ములాయం కుమారుడు, ఎస్పీ అగ్రనేత అఖిలేశ్ యాదవ్.. మేదాంత ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ సైతం గురుగ్రామ్‌కు బయలుదేరారు.
82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఆగస్టు 22 నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియా పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. 'ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య క్షీణించడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ఆయన త్వరగా కోల్కోవాలని ప్రార్థిస్తున్నాం' అని ట్వీట్ చేశారు.
బంగాల్ గవర్నర్ అస్వస్థత..
మణిపుర్ గవర్నర్ లా గణేశన్.. శనివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు అధికారులు. ఆయన చెన్నై పర్యటనలో ఉండగా అనారోగ్యానికి గురయ్యారని అధికారులు తెలిపారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని భాజపా నేత ఒకరు తెలిపారు. గణేశన్.. బంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇవీ చదవండి: 'ఖర్గేతో మార్పు సాధ్యం కాదు'.. ముఖాముఖి చర్చకు శశిథరూర్ డిమాండ్!
గుజరాత్లో కేజ్రీవాల్‌కు చేదు అనుభవం.. వాటర్ బాటిల్‌తో దాడి!