ETV Bharat / bharat

పన్నెండేళ్ల తర్వాత అమ్మ, నాన్న చెంతకు ములాయం- ఆ పోలీసు చలవే! - సోనాభద్ర చేరుకున్న ములాయం సింగ్​

పన్నెండేళ్ల తరువాత ములాయం సింగ్​ తిరిగి ఇంటికి వచ్చాడు. అతడి రాకతో కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇంతకీ ములాయం సింగ్​ ఇంటి నుంచి ఎందుకు బయటకు వెళ్లాడు? ఇన్నేళ్లు ఏం చేశాడు?

ోmulayam reached home
ములాయం అమ్మకు అభినందనలు తెలుపుతున్న ఏఎస్​ఐ
author img

By

Published : Mar 14, 2022, 6:21 PM IST

Updated : Mar 14, 2022, 8:42 PM IST

పన్నెండేళ్ల తర్వాత అమ్మ, నాన్న చెంతకు ములాయం- ఆ పోలీసు చలవే!

కుటుంబ సభ్యుల మీద అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ కుర్రాడు.. సుమారు పన్నెండేళ్ల తరువాత తన వారిని కలుసుకున్నాడు. పుష్కర కాలం పాటు కొడుకు కోసం వేచి చూసిన ఆ అమ్మ అతని స్పర్శతో పులకరించిపోయింది. కుమారుడ్ని మనసారా హత్తుకుని ఏళ్ల నాటి బాధను మరిచిపోయింది. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి.. మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోను అని చెప్పాడు ఆ యువకుడు.

mulayam reached home
ములాయం అమ్మకు అభినందనలు తెలుపుతున్న ఏఎస్​ఐ

ఏం జరిగింది అంటే..?

ఉత్తర్​ప్రదేశ్​లోని సోన్​భద్ర జిల్లాకు చెందిన ములాయం సింగ్ 13 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులతో గొడవపడి 12 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఈ పుష్కరకాలంలో వివిధ ప్రాంతాలను తిరిగిన ఆ కుర్రాడు.. చివరకు పంజాబ్​లోని అమృత్​సర్​ చేరుకున్నాడు. అప్పటికే అతని మానసిక స్థితి సరిగా లేదు. వింత చేష్టలు, అర్థంకాని పాటలు పాడుతుండే వాడు. అయితే దీనినంతటినీ పంజాబ్​ పోలీసు శాఖలో ఏఎస్​ఐగా పని చేస్తున్న సుఖ్​విందర్​ సింగ్​ గమనించారు. ఎలా అయినా సరే ఆ యువకుడ్ని తల్లిదండ్రుల దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్నారు. తెలిసిన కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో అతని చిరునామా కనుగొన్నారు. ములాయంను అతడి సొంత ఊరు అయిన సోన్​భద్ర జిల్లా బహర్​ గ్రామానికి తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పారు.

mulayam reached home
ములాయంను కుటుంబ సభ్యులతో కలిపిన సుఖ్​విందర్​ సింగ్​

కుమారుడ్ని చూసిన వెంటనే తల్లిదండ్రులు తన్మయత్వానికి లోనయ్యారు. దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్నారు. తమ కుమారుడ్ని అప్పగించిన ఏఎస్‌ఐ సుఖ్‌విందర్​కు ధన్యవాదాలు తెలిపారు. ములాయంను వారి అమ్మానాన్నలతో కలపడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఏఎస్​ఐ సుఖ్​విందర్ అన్నారు.

ఇవీ చూడండి:

కొనఊపిరితో చిన్నారి.. పనిచేయని ఆక్సిజన్ యంత్రం.. డాక్టర్ ఐడియాతో...

గర్భిణీకి అరుదైన సర్జరీ.. కడుపులో నుంచి అరకిలో రాయిని తొలగించి..

Last Updated : Mar 14, 2022, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.