ETV Bharat / bharat

'రాష్ట్రపతి జీ.. మాకో హెలికాప్టర్​​ ఇప్పించరూ..'

అది ఓ సాధారణ రైతు కుటుంబం. తమకున్న కొద్దిపాటి భూమిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇంతలో.. వారి పొలానికి వెళ్లే అన్ని దారుల్ని మూసివేయించారు అక్కడి గ్రామపెద్ద. దీనిపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగొచ్చిన ఆ ఇంటి మహిళ.. ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. తమ సమస్య పరిష్కారానికి ఓ హెలికాప్టర్​ ఏర్పాటు చేయాలని కోరారు.

author img

By

Published : Feb 12, 2021, 4:51 PM IST

Updated : Feb 12, 2021, 6:42 PM IST

Madhya pradesh woman farmer writes to president
'రామ్​నాథ్​జీ.. మాకో హెలికాఫ్టర్​ ఇప్పించండి ప్లీజ్​!'

మధ్యప్రదేశ్​ మంద్​సౌర్​కు చెందిన ఓ మహిళా రైతు.. హెలికాప్టర్​​ కొనేందుకు రుణం మంజూరు చేయాలని కోరుతూ ఏకంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశారు. అంతేకాదు.. ఆ హెలికాప్టర్​ నడిపేందుకు లైసెన్స్​ ఇప్పించాలని కూడా అందులో పేర్కొన్నారు బసంతి బాయి లోహర్​.

బసంతికి శ్యామ్​గఢ్​ మండలం ఆగర్​ గ్రామంలో కొంత సాగు భూమి ఉంది. ఇందులో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబ జీవనం సాగిస్తోంది. అయితే.. వారి పొలానికి వెళ్లే అన్ని మార్గాలను ఆ ఊరి పెద్దైన పర్మానంద్​ పాటిదర్​, అతని కుమారుడు లవకుశ కలిసి ఇటీవల మూసివేయించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ.. స్థానిక అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారట బసంతి. అయినా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక.. రాష్ట్రపతికి తమ గోడును విన్నవించుకున్నట్టు చెప్పుకొచ్చారా మహిళా రైతు.

MP woman writes to President seeking helicopter to reach farm land
రాష్ట్రపతికి రాసిన లేఖ

"మా పొలం సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నోసార్లు తిరిగాం. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక వేరే దారి కనిపించనందున.. ఈ సమస్యకు పరిష్కారంగా ఓ హెలికాప్టర్​​ కొనేందుకు రుణం ఇప్పించాలని రాష్ట్రపతిని కోరాం. దాన్ని నడిపేందుకు లైసెన్స్​ మంజూరు చేయాలనీ అభ్యర్థించాం."

- బసంతి బాయి లోహర్​, రైతు

ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని బంధువుల అమానవీయ దాడి

Last Updated : Feb 12, 2021, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.