ETV Bharat / bharat

ఆస్పత్రిలో మహిళకు తాంత్రికుడితో పూజలు.. వైద్యులు అడ్డుచెప్పేసరికి.. - తాంత్రికుడి పూజలు

Exorcism Ritual On Woman Patient: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఓ మహిళకు తాంత్రికుడితో పూజలు నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని అశోక్​నగర్​లో శుక్రవారం జరిగింది. కాగా ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Ashoknagar Hospital Treatment Through Tantra Mantra

author img

By

Published : May 8, 2022, 7:33 PM IST

మహిళకు తాంత్రికుడి చేత పూజలు

Tantrik Rituals On Women Patient: సైన్స్​ అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో.. ఇంకా కొంతమంది ప్రజలు మూఢ నమ్మకాలతోనే జీవిస్తున్నారు. అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు తాంత్రికుడితో పూజలు నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని అశోక్​నగర్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. అనారోగ్యంతో ఉన్న మహిళపై నీళ్లు కొడుతూ పూజలు చేస్తున్న వీడియో వైరల్​గా మారింది. ఈ చర్యను కట్టడి చేయనందుకుగాను ఆ సమయంలో విధుల్లో ఉన్న వైద్యులకు నోటీసులు ఇస్తామని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డీకే భార్గవ తెలిపారు.

అశోక్​నగర్​లోని ఓ ప్రాంతంలో కచ్చియా బాయి అహిర్వార్ అనే 65 ఏళ్ల మహిళ​ నివసిస్తోంది. ఓ వివాహ వేడుకకు హాజరైన ఆమె అస్వస్థతకు గరైంది. దీంతో శుక్రవారం ఆమెను అశోక్​నగర్​లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళకు దుష్ట శక్తులు ఉన్నాయని నమ్మిన కుటుంబ సభ్యులు ఓ తాంత్రికుడిని తీసుకువచ్చి ఆస్పత్రిలోనే పూజలు నిర్వహించారు. దీనికి అడ్డుచెప్పిన ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై విచారణ చేపడుతామని చీఫ్​ మెడికల్​ హెల్త్​ ఆఫీసర్​ నీరజ్​ ఛరి తెలిపారు.

ఇదీ చదవండి: శవాలను కూర్చోబెట్టి స్టూడెంట్స్​కు క్లాస్​- డాక్టర్​ ప్రయోగం సక్సెస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.