మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమెల్యే మురళీ మోర్వాల్ కుమారుడు కరణ్ మోర్వాల్.. ఓ రేప్ కేసులో పోలీసులకు దొరకడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ 2న అతడిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి కిరణ్ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10వేలు బహుమానం ప్రకటించారు పోలీసులు.
నెలలు గడుస్తున్నా కిరణ్ మోర్వా ఆచూకీ తెలియడం లేదు. దీంతో అతడిపై ఉన్న రివార్డును రూ.10వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ బుధవారం ప్రకటించారు. అయినా అతని గురించి ఎలాంటి సమాచారం అందడం లేదు. కరణ్‌ను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
అయితే కరణ్ సోదరుడు శివంను పోలీసులు ప్రశ్నించినట్లు అధికారులు తెలిపారు. రేప్ కేసు నమోదైన పలాసియా పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్యే మురళీ మోర్వాల్ వెళ్లారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. స్టేషన్‌కు ఎందుకు వెళ్లారని మీడియా అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే సమాధానం ఇవ్వలేదు.
60ఏళ్ల మహిళపై 20ఏళ్ల యువకుడు అత్యాచారం
ఝార్ఖండ్ సిమ్డెగా జిల్లాలో 60ఏళ్ల మహిళపై 20ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హొటల్లో పనిచేస్తున్న ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఒడిశా మీదుగా దిల్లీ పారిపోయేందుకు అతడు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఇదీ చదవండి: ఫుడ్ డెలివరీ బాయ్స్ ముసుగులో డ్రగ్స్ దందా