ETV Bharat / bharat

'మత స్వేచ్ఛ' బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం

బలవంతపు మతమార్పిడులను అడ్డుకునే మతస్వేచ్ఛ బిల్లును మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదించింది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇది అమలులోకి వస్తే మోసపూరిత వివాహాలను చెల్లనిదిగా పరిగణిస్తారు. నిందితులకు పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ. లక్ష జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

author img

By

Published : Dec 26, 2020, 1:48 PM IST

MP cabinet gives nod to Religious Freedom Bill
'మత స్వేచ్ఛ' బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం

మతస్వేచ్ఛ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు అమలులోకి వస్తే మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతమార్పిడులకు పాల్పడేవారికి 10 ఏళ్ల వరకు శిక్ష పడుతుంది. అంతేగాక రూ. లక్ష వరకు జరిమానా విధించే అవకాశం లభిస్తుంది.

ఈ బిల్లు అమలులోకి వస్తే దేశంలో మత మార్పిడులకు వ్యతిరేకంగా రూపొందిన పటిష్ఠ చట్టంగా నిలుస్తుందని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. 1968 మత స్వేచ్ఛ చట్టం స్థానంలో ఇది అమలులోకి వస్తుందని చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

ఈ చట్టం ప్రకారం మోసపూరితంగా జరిగిన వివాహాన్ని చెల్లనిదిగా పరిగణనలోకి వస్తుందని చెప్పారు మిశ్రా. మతాన్ని మార్చుకోవాలని అనుకునేవారు జిల్లా ప్రభుత్వ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకొనేలా ఓ నిబంధన జోడించినట్లు వివరించారు.

యూపీ ఆర్డినెన్సుకు నెలరోజులు

మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్ తీసుకొచ్చిన ఇదే తరహా 'లవ్ జిహాద్' ఆర్డినెన్సుకు నెల రోజులు నిండాయి. నవంబర్ 27న అమలులోకి వచ్చిన ఆర్డినెన్సు ఆధారంగా... 12 ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. బలవంతంగా మత మార్పిడులకు సంబంధించి 35 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఆర్డినెన్సు అమలులోకి వచ్చిన తర్వాతి రోజే బరేలీలో ఓ కేసు వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి: ప్రాథమిక హక్కుపైనా ఉక్కుపాదం?

అయితే, యోగి సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్సుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు దీన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం సైతం దాఖలైంది.

లవ్ జిహాద్ అంటే..

ఇటీవలి కాలంలో పలు భాజపా పాలిత రాష్ట్రాలు ఈ తరహా చట్టాలు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. ప్రేమ, పెళ్లి పేరిట హిందూ మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారేలా చేస్తున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ ఆర్డినెన్సులు ఉపయోగపడతాయని చెబుతున్నాయి. ఈ బలవంతపు మత మార్పిడులనే 'లవ్​ జిహాద్​'గా అభివర్ణిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'లవ్ జిహాద్'​ అరెస్టుపై హైకోర్టు స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.