ETV Bharat / bharat

MP AVINASH PETITION: "వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అరెస్టు చేసే ఉద్దేశంతో సీబీఐ" - news updates in ap

MP AVINASH ANTICIPATORY BAIL PETITION: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎపీ అవినాష్​ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నేడు సీబీఐ విచారణ నేపథ్యంలో పిటిషన్​ దాఖలు చేశారు.

mp avinash anticipatory bail
mp avinash anticipatory bail
author img

By

Published : Apr 17, 2023, 1:22 PM IST

MP AVINASH ANTICIPATORY BAIL PETITION: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని అవినాష్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆయన హైకోర్టును కోరారు. ఎంపీ అవినాష్​ అభ్యర్థనపై మధ్యాహ్నం 2.30గంటలకు హైకోర్టు విచారణ జరపనుంది.

ముందస్తు బెయిల్​ పిటిషన్​లో పలు కీలక అంశాలు: అయితే ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్​ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్​ పిటిషన్​లో పలు విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో సీబీఐ నాలుగు సార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసిందని ఆయన తెలిపారు. నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పిందని.. ఇప్పుడు అరెస్టు చేసే ఉద్దేశంతో ఉందని ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. వైఎస్​ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోందని ఆరోపణలు చేశారు. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదని.. వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని అవినాష్ అన్నారు.

"వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దస్తగిరి వాంగ్మూలం మేరకు ఇరికించాలని సీబీఐ చూస్తోంది. ఇప్పటికే సీబీఐ నాలుగుసార్లు విచారించి వాంగ్మూలం నమోదు చేసింది. నిందితుడిగా చేర్చే అవకాశం ఉందని గతంలో హైకోర్టులో సీబీఐ చెప్పింది. నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంతో సీబీఐ ఉంది. ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను సీబీఐ తెరపైకి తెచ్చింది. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ కచ్చితమైన సాంకేతిక పరిజ్ఞానం కాదు. వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదు.: నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేశారు"- వైఎస్​ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ

నాలుగు సంవత్సరాలలో అనేక పరిణామాల తర్వాత తనని లక్ష్యంగా చేశారని అవినాష్ ఆరోపించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ముందస్తు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన అవినాష్.. పిటిషన్‌పై విచారణ తేలేవరకు అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా ఆదేశించాలని పిటిషన్​లో కోరారు. అయితే ఈ నేపథ్యంలో అవినాష్​ రెడ్డి పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ అవినాష్​ పిటిషన్​ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేస్తే.. తర్వాత జరిగే పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.