కరోనా కారణంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. నేడు సమావేశాలు ప్రారంభం కానుండగా.. ముందస్తుగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో 66 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఇందులో అధికారులు, సిబ్బంది సహా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష భేటీ అనంతరం.. 3 రోజుల అసెంబ్లీ సెషన్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ మేరకు అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ సింగ్ మీడియాకు వెల్లడించారు.
ఇంకా అందరు శాసనసభ్యుల రిపోర్టులు రాలేదని ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, వారి సిబ్బంది అంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 2 లక్షల 30 వేల కేసులు బయటపడ్డాయి. వీరిలో 3545 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కేసులు కోటి దాటగా.. 97 లక్షల మంది కోలుకున్నారు. లక్షా 47 వేల మంది మృత్యువాతపడ్డారు.
ఇదీ చూడండి: నాలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్