ETV Bharat / bharat

15 ఏళ్లుగా సహజీవనం.. ఒకేసారి ఒకే వేదికపై ముగ్గురితో పెళ్లి - Unique marriage

Man Marries Three Partners: 15 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి.. ఇప్పుడు ఆ ముగ్గురినీ ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నారు. వారి ఆరుగురు పిల్లలూ ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ఇంతకీ ఇది జరిగింది ఎక్కడంటే?

Man Marries Three Partners at Same Time
madhya pradesh marriage
author img

By

Published : May 3, 2022, 7:45 AM IST

Updated : May 3, 2022, 10:01 AM IST

ఒకేసారి ఒకే వేదికపై ముగ్గురితో పెళ్లి

Man Marries Three Partners: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో సహజీవనం చేశారో వ్యక్తి. ఇప్పుడు ఆ ముగ్గురినీ వివాహం చేసుకున్నారు. అదీ ఒకే వేదికపై. మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పుర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల సమర్థ్‌ మౌర్య గతంలో సర్పంచిగా పనిచేశారు. 15 సంవత్సరాలుగా ఆయన ముగ్గురితో సహజీవనం చేస్తున్నారు. ఇప్పటికే వారికి ఆరుగురు పిల్లలు. ఈ నేపథ్యంలో తాజాగా గిరిజన సంప్రదాయం ప్రకారం ఒకే వేదికపై ముగ్గురినీ పెళ్లి చేసుకున్నారు. వారి ఆరుగురు పిల్లలూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.

Tribal marriage news
సమర్థ్​ మౌర్య

"2003లో నా మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడింది. 15 ఏళ్లుగా మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాను. ఏప్రిల్​ 30న నాకు వివాహం జరిగింది. మా సంప్రదాయం ప్రకారం వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి అనుమతించరు. గతంలో నన్ను ఏ శుభకార్యానికి అనుమతించలేదు."

- సమర్థ్​ మౌర్య

క్రమంలో ఏప్రిల్‌ 30న ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నారు మౌర్య. డోలు వాయిద్యాల నడుమ గిరిజన ఆచారాల ప్రకారం మూడు రోజులపాటు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగినట్లు తెలిపారు. ఈ వివాహానికి పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హాజరయ్యారు. ఈ వ్యవహారం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tribal marriage news
గిరిజన సంప్రదాయంలో వివాహం
Tribal marriage news
ముగ్గురితో సమర్థ్​ మౌర్య వివాహం

ఇదీ చూడండి: అక్కడ.. పిల్లలు పుట్టాకే పెళ్లి చేసుకుంటారట!

Last Updated : May 3, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.