Mother Suicide with Two Sons in Hyderabad : హైదరాబాద్‌లో ఇవాళ మరో విషాదం జరిగింది. ఉదయం బోయిన్‌పల్లిలో ఓ తండ్రి ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరవక ముందే బోరబండలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి.. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లీకుమారుల ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్(Borabanda Police Station) పరిధిలోని రాజ్‌నగర్‌కు చెందిన జ్యోతి(31) బంజారాహిల్స్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె భర్త విజయ్ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆ దంపతులు వారి ఇద్దరు పిల్లలు ఆదిత్య, ఆర్జున్‌తో కలిసి రాజ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా జ్యోతి కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చాడు. వారిద్దరిలో ఒకరు సరిగా నడవలేకపోవడం.. మరొకరికి మాటలు రాకపోవడంతో ఆమె మానసికంగా వేదన చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే జ్యోతి ఉరి వేసుకుని, కుమారులకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులు గమనించేలోగా జ్యోతి శవం వేలాడుతూ కనిపించింది. గదిలో ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. తల్లీపిల్లల మృతితో ఆ ప్రాంతం అంతా విషాదంలో మునిగిపోయింది.
Father and Two Daughters Suicide : పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య.. కారణమేంటి..?
Mother suicide with Two Kids in Hyderabad : పిల్లల అంకవైకల్య విషయమై వేదనకు గురై(Family Strife) బిడ్డలతో కలిసి జ్యోతి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేని ఆమె భర్త విజయ్ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్థానికుల ఫిర్యాదుతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి ఇంటిని పరిశీలించి.. ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. మరింత సమాచారం కోసం జ్యోతి మామ, అత్తవారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లి ప్రాంతంలో ఒక తండ్రి తన ఇద్దురు కుమార్తెలతో కలిసి విషం తాగి మరణించగా.. ఇప్పుడు బోరబండలో మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి విషం తాగే బలవన్మరణానికి పాల్పడింది. దాంతో ఈ రెండు ఘటనలు ఒకేలా ఉండడంతో పోలీసుల అప్రమత్తం అయ్యారు.
Couple Suicide in Peddapalli : ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఆ పసిబిడ్డలకు దిక్కెవరు?