ETV Bharat / bharat

చీర కోసం మహిళ దుస్సాహసం.. కుమారుడ్ని 9వ అంతస్తు నుంచి వేలాడదీసి.. - చీర కోసం తొమ్మిదో అంతస్తుపై సాహసం

Mother risks son for sari: ఈదురు గాలులకు బాల్కనీలో ఆరేసిన ఓ చీర.. కింది అంతస్తులో పడిపోయింది. అయితే, ఆ చీరను తీసుకొచ్చేందుకు ఓ తల్లి తన కొడుకుతో భవనం తొమ్మిదో అంతస్తు ఎత్తులో సాహసం చేయించింది. బెడ్​షీట్​ సాయంతో బాలుడిని కింది అంతస్తుకు పంపింది.

Mother risk for sari
Mother risk for sari
author img

By

Published : Feb 13, 2022, 3:42 PM IST

Mother risks son for sari: హరియాణా ఫరీదాబాద్​కు చెందిన ఓ మహిళ.. తన చీర కోసం కొడుకుతో సాహసం చేయించింది. తొమ్మిదో అంతస్తులో నివాసం ఉంటున్న ఆ మహిళ.. తన దుస్తులను బాల్కనీలో ఆరేసింది. అయితే గాలి బలంగా వీడయం వల్ల ఓ చీర.. ఎనిమిదో అంతస్తు బాల్కనీలో పడిపోయింది. దీంతో తన కొడుకును రంగంలోకి దింపింది ఆ తల్లి.

ఓ బెడ్​షీట్ సాయంతో తొమ్మిదో అంతస్తు నుంచి తన కొడుకును ఎనిమిదో అంతస్తుపైకి వెళ్లేలా చేసింది ఆ మహిళ. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్ చేశారు.

ఎనిమిదో అంతస్తులో పడిపోయిన తన తల్లి చీరను తీసుకొని మళ్లీ ఆ బెడ్​షీట్ సాయంతోనే తొమ్మిదో అంతస్తుకు చేరుకున్నాడు ఆ బాలుడు. తొమ్మిదో అంతస్తులో ఉన్న కుటుంబ సభ్యులు కలిసి.. బాలుడిని పైకి లాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: నల్లగా మారిన గంగాజలాలు... స్నానాలు చేయాలంటే భయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.