ETV Bharat / bharat

తెగిన పేగు బంధం.. కుమారుడికి తల్లి అంత్యక్రియలు.. బోరున విలపిస్తూనే.. - కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించిన తల్లి

ఏ లోటూ రాకుండా చూస్తూ తనకు అండగా కుమారుడు ఉన్నాడన్న ఆ తల్లి ఆనందం ఒక్కసారిగా కరిగి పోయింది. రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడంతో కుమారుడితో ఉన్న పేగు బంధం తెగిపోయింది. చివరకు తనే కుమారుడికి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఈ విషాదం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Mother performed last rites of son
కుమారుడికి తల్లి అంత్యక్రియలు
author img

By

Published : Jul 19, 2022, 9:27 PM IST

Updated : Jul 19, 2022, 9:59 PM IST

అనారోగ్యంతో భర్త కొంతకాలం క్రితమే చనిపోయినా 'చెట్టంత కొడుకు ఉండగా నాకేంటి'.. అని ఆ తల్లి ధీమాగా ఉండేది. కొడలు, మనవరాలితో జీవితం హాయిగా గడిచిపోతున్న సమయంలో ఆమెకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తన చివరి వరకు తోడుగా ఉండి బాగోగులు చూసుకుంటాడనుకున్న కన్నకొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. భర్త కూడా లేకపోవడం వల్ల ఆ అంత్యక్రియలు ఆమెనే నిర్వహించాల్సి వచ్చింది. బరువెక్కిన గుండెతో విలపిస్తూ చితికి నిప్పు పెట్టింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్​ప్రదేశ్​ జౌన్​పుర్​లోని​ కొత్వాలీ ప్రాంతంలో జరిగింది.

సామాజిక కార్యకర్త అయిన అంజూ పాఠక్.. 32 ఏళ్ల తన కుమారుడు హిమాన్షు, అతని భార్య, కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. అయితే ఇటీవల లఖ్​నవూ వెళ్లిన హిమాన్షు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. అయితే చికిత్స సమయంలో ఇచ్చిన మందులు దుష్ప్రభావం చూపాయని.. అది కాస్త లివర్​ చెడిపోయేందుకు దారి తీసిందని బంధువులు ఆరోపించారు. ఆ కారణంగానే అతను ప్రాణాలు కోల్పోయాడని చెప్పుకొచ్చారు. ఆచారం ప్రకారం ఇంటిలో మగవారు ఎవరూ లేకపోవడం వల్ల తల్లే ఈ అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంజూ హిమాన్షు చితికి నిప్పు పెడుతున్న ఫొటో సోషల్​మీడియాలో వైరల్​ కావడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Mother performed last rites of son
కుమారుడి చితికి నిప్పుపెడుతున్న తల్లి

కిలోమీటరు వరకు..: కేరళలోని కాసరగోడ్​ జిల్లాలో దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పులిమ్​కోచి ప్రాంతంలో గోపాలన్​ అనే ఓ వ్యక్తి మృతదేహాన్ని అతని నివాసానికి తరలించేందుకు కిలోమీటరుకుపైగా కాలినడకనే ఆ శవాన్ని మోస్తూ వెళ్లారు స్థానికులు. సరైన రోడ్డు లేక వాహనాల సదుపాయం అందుబాటులోకి రాకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. దారి మధ్యన వచ్చే వాగును దాటేందుకు ఓ బ్రిడ్జిని కూడా చెక్కతో గ్రామస్థులే నిర్మించుకున్నారు. సరైన బ్రిడ్జి, రోడ్డును వేయాలని ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేశామని కానీ ఎలాంటి ఫలితం లేదని స్థానికులు పేర్కొన్నారు.

కాలినడకన కిలోమీటరుకు పైగా మృతదేహాన్ని మోసుకెళ్లిన స్థానికులు

ఇదీ చూడండి : 'లోదుస్తులన్నీ ఓకే చోట.. చున్నీ కూడా లేదు'.. నీట్​ అభ్యర్థి తీవ్ర భావోద్వేగం

Last Updated : Jul 19, 2022, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.