ETV Bharat / bharat

Mother Kills Newborn: నీళ్లల్లో ముంచి.. కన్నబిడ్డనే చంపేసిన తల్లి - కేరళ క్రైమ్​

Mother Kills Newborn: వారం రోజుల క్రితం పుట్టిన మగబిడ్డను.. బకెట్​ నీళ్లల్లో ముంచి కన్నతల్లే చంపేసిన ఘటన కేరళలో జరిగింది. ఆరో బిడ్డ పుట్టాడని తెలిస్తే సమాజం అవమానిస్తుందని భావించి ఈ దారుణానికి ఒడిగట్టింది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అంత మంది పిల్లలను పెంచడం కష్టమని చంపేసింది. ఈ విషయం పోలీసుల విచారణలో బయటపడింది.

mother kills newborn
నీళ్లల్లో ముంచి.. కన్నబిడ్డనే చంపేసిన తల్లి
author img

By

Published : Dec 11, 2021, 9:05 AM IST

Woman Kills Child: కేరళ కొట్టాయంలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. 6వ బిడ్డకు జన్మనించినందుకు సమాజం అవమానిస్తుందనే భయంతో.. పసికందును హతమార్చింది ఓ తల్లి. ఆ తర్వాత పోలీసులకు కట్టుకథలు చెప్పింది.

ఇడక్కున్నమ్​ ముక్కలి ప్రాంతంలో నివాసముంటున్న నిశా, సురేశ్​ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. గత శనివారం.. మరో మగబిడ్డకు జన్మనిచ్చింది నిశా. ఈ క్రమంలోనే ఆమెకు భయం పట్టుకుంది. సమాజంలో నవ్వులపాలు అవుతానని, అవమానానికి గురవుతానని భావించింది. దీనికి కుటుంబ ఆర్థిక కష్టాలు తోడయ్యాయి. అంతమంది బిడ్డలను పెంచడం కష్టమని.. చివరికి పసికందును బకెట్​ నీళ్లల్లో ముంచి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేసింది.

mother kills newborn
కన్నబిడ్డను చంపిన నిశా నివాసం

పసికందు మరణ వార్త తెలుసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తల్లిని విచారించారు. స్నానం కోసం బకెట్​లో నీళ్లు పెడితే, ప్రమాదవశాత్తు అందులో పడి బిడ్డ మరణించాడని నిశా చెప్పింది. కానీ అసలు విషయం పోస్టుమార్టంలో బయటపడింది. ఆ తర్వాత నిశా తన నేరాన్ని అంగీకరించింది. తానే బకెట్​లో పసికందును పడేసినట్టు ఒప్పుకుంది.

ఇదీ చూడండి:- కుమారుడ్ని కరిచిందని కుక్కపై కర్కశత్వం- కత్తితో కోసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.