ETV Bharat / bharat

3 నెలల పాపను చంపి కొలనులో విసిరిన తల్లి.. ఆపై కిడ్నాప్ డ్రామా - కూతురిని చంపిన తల్లి

Mother Kills Daughter: తన కూతురు అపహరణకు గురైందని ఓ తల్లి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. షాకింగ్​ విషయాలు తెలుసుకున్నారు. తల్లే పాపను చంపేసిందని తేల్చారు.

Mother Kills Daughter
mother killed her daughter
author img

By

Published : Dec 3, 2021, 7:16 AM IST

Mother Kills Daughter: ఆడపిల్లను తల్లే వద్దనుకుంది. కర్కషంగా చిన్నారిని పొట్టనుపెట్టుకుంది. మళ్లీ ఏమీ తెలియనట్టు తన పాప అపహరణకు గురైందని నాటకమాడింది. అయితే పోలీసుల దర్యాప్తులో కఠోర వాస్తవం వెలుగులోకి వచ్చి తల్లి దారుణం బయటపడింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?

ముంబయిలోని కాలాచౌకీ ప్రాంతంలో నివాసముంటోంది సప్నా మగ్దూం. ఆమెకు మూడు నెలల చిన్నారి ఉంది. అయితే నవంబర్​ 30న తన పాత ఫోన్​కు బదులు కొత్త పాత్రలు తీసుకోవాలని వాటిని అమ్మే మహిళను లోనికి పిలిచింది. ఈ క్రమంలో తనకు మత్తు మందు ఇచ్చి.. సదరు మహిళ చిన్నారిని అపహహరించిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది సప్నా.

దర్యాప్తు ప్రారంభించింది పోలీసులు.. విస్తుపోయే వాస్తవాన్ని తెలుసుకున్నారు. సప్నానే తన కూతురిని చంపి నీటి కొలనులో విసిరేసిందని తేల్చారు. ఇదంతా తనకు ఆడపిల్ల అంటే ఇష్టం లేకపోవడం వల్లనేనని నిర్ధరించారు.

ఇదీ చూడండి: పసికందును ట్యాంకులో ముంచి చంపిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.