ETV Bharat / bharat

4 నెలల బాలుడిని నదిలో పడేసిన తల్లి.. జాతకాల్లో అలా ఉందని.. - తల్లి హత్య

Mother killed son: జాతకాల్లో తమ టైం సరిగాలేదనే కారణంగా నాలుగు నెలల బాలుడిని నదిలో పడేసి తల్లే హత్య చేసిన దారుణ సంఘటన తమిళనాడు దిండిగుల్​ జిల్లాలో బుధవారం జరిగింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకుంది నిందితురాలు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Mother killed son
పసికందు హత్య
author img

By

Published : Mar 24, 2022, 8:34 PM IST

Mother killed son: జాతకాల పిచ్చితో నాలుగు నెలల బాలుడిని నదిలో పడేసి హత్య చేసింది ఓ తల్లి. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు తన కుమారుడిని ఎవరో ఎత్తుకెళ్లారని నాటకమాడింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ఈ సంఘటన తమిళనాడు, దిండిగుల్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది: జిల్లాలోని రాజాపురమ్​ పంచాయతీ, పలానీ గ్రామానికి చెందిన మహేశ్వరన్​- లత దంపతులకు మూడేళ్లు, నాలుగు నెలల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. మార్చి 23 బుధవారం రోజున మహేశ్వరన్​ పని కోసం వెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో నాలుగు నెలల బాబును తీసుకుని పలారు పోరుందలారుకు తీసుకెళ్లి నదిలో పడేసి వచ్చింది లత.

ఇంటికి వచ్చాక ఏమీ తెలియనిదానిలా.. తన కుమారుడిని ఎవరో ఎత్తుకెళ్లారంటూ బోరున ఏడుస్తూ నాటకాలు మొదలు పెట్టింది. కొద్ది సమయానికి పలారు పోరుందలారులో నదిలోని ముళ్ల పొదల్లో బాబును గుర్తించిన స్థానికులు పలాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు లత పొంతనలేని సమాధానాలు చెప్పగా అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. దీంతో తానే తన కొడుకుని నదిలో పడేసి హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. జాతకంలో ప్రస్తుతం తమ సమయం బాగోలేదని తెలిసిందని, అందుకే బాబును హత్య చేశాని చెప్పగా.. పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.