ETV Bharat / bharat

కుమారుడి పబ్​జీ ఆటకు తల్లి బలి! - పబ్​జీ గేమ్​ న్యూస్​

PUBG Addiction: పబ్​జీ.. దీనికి బానిసై అనేక మంది పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. పబ్​జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా.. అడ్డుకోబోయిన ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

PUBG Addiction
PUBG Addiction
author img

By

Published : May 26, 2022, 12:50 PM IST

PUBG Addiction: కుమారుడి పబ్​జీ పిచ్చి తల్లి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. పబ్​జీ ఆడుతున్న కొడుకును భర్త కొడుతుండగా అడ్డుకోబోయిన మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. ఇంతియాజ్​, మైమున దంపతులు కర్ణాటక చిక్కమగళూరు తాలుకాలోని హగలఖాన్​ ఎస్టేట్​లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నాడు. పబ్​జీకి బానిసైన చిన్న కుమారుడు అదే పనిగా ఆడుతుండేవాడు. దీంతో పబ్​జీ ఆడొద్దంటూ కొడుకును మందలించాడు తండ్రి.

.
నిందితుడు ఇంతియాజ్​

ఇదే విషయమై తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తింది. కోపంతో ఉన్న ఇంతియాజ్​.. కుమారుడిని చంపేస్తానంటూ తుపాకీ పట్టుకున్నాడు. తన కొడుకును చంపుతాడనే భయంతో భర్తను అడ్డుకోబోయింది మైమున. మద్యం మత్తులో ఉన్న ఇంతియాజ్​ తుపాకీతో కాల్చడం వల్ల మైమునకు బుల్లెట్​ తగిలింది. వెంటనే పెద్ద కుమారుడు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 'మెక్​డీ' కూల్​డ్రింక్​లో బల్లి.. అడిగితే నవ్వుతూ బెదిరింపులు.. చివరకు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.