ఇద్దరు సోదరులు లేదా సోదరీమణులు.. మరీ అయితే ఇద్దరు స్నేహితులు.. తమ పెళ్లిళ్లు ఒకేసారి జరుపుకోవాలని ప్రణాళికలు రచించుకుంటారు. అయితే ఉత్తర్ప్రదేశ్ గోరఖ్పుర్ జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు.. తమ వివాహాలు ఒకేసారి చేసుకుని అందర్ని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు వీరి పెళ్లిళ్లు ఒకే మండపంలో జరగడం విశేషం.
పిప్రౌలి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ.. 'ముఖ్యమంత్రి సాముహిక్ వివాహ్ యోజన' కింద మొత్తం 63 వివాహాలు జరిగాయి. ఇందులో భాగంగానే తల్లీకూతుళ్ల వివాహాలు జరిగాయి.
బేలా దేవి(53).. 25 సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయింది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. 25 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న ఆమె.. అదే ప్రాంతానికి చెందిన హరిహార్ సోదరుడు జగదీశ్ (55)ను వివాహం చేసుకుంది. అయితే అదే మండపంలో 27ఏళ్ల తన కుమార్తె ఇందుకు పెళ్లి జరిపించింది. ఈ కార్యక్రమానికి స్థానిక అధికారులు సహా పలువురు హాజరయ్యారు.
"రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యమంత్రి సాముహిక్ వివాహ్ యోజన కింద పేదలు, వితంతువులకు వివాహాలు జరిపించడం సంతోషకరం" అని సాంఘిక సంక్షేమ అధికారి సప్త్రాష్ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: రైతు నిరసనల్లో పాల్గొనేందుకు 225కి.మీ సైక్లింగ్