ETV Bharat / bharat

ఫుట్​పాత్​పై పడి ఉన్న కరెంట్ ​తీగ తాకి తల్లీకూతుళ్లు మృతి- దీపావళికి వెళ్లి వస్తుండగా - విద్యుదాఘాతంలో తొమ్మిది నెలల పసిపాప మృతి

Mother And Daughter Die Due To Electric Shock : ఫుట్​పాత్​పై పడి ఉన్న కరెంట్ షాక్​ తగిలి తల్లీకూతుళ్లు మరణించారు. ఈ హృదయ విదారక ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది. దీపావళి పండగ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వారి భర్తకు సైతం తీవ్ర గాయలయ్యాయి.

Mother And Daughter Die Due To Electric Shock

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2023, 3:44 PM IST

Mother And Daughter Die Due To Electric Shock : దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకొంది ఆ కుటుంబం. అయితే, ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పండగ తర్వాత ఇంటికి తిరిగి వెళ్తుండగా పుట్​పాత్​పై కరెంట్​ తీగ రూపంలో ఉన్న మృత్యువు.. వారి జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కరెంట్ షాక్ తగిలి తల్లీకూతుళ్లు మృతిచెందారు. ఈ విషాద ఘటన బెంగళూరులో ఆదివారం ఉదయం జరిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?
సౌందర్య(23), సంతోశ్​​ అనే దంపతులు బెంగళూరులోని ఏకే గోపాలన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారికి ఓ తొమ్మిది నెలల చిన్నారి ఉంది. దీపావళి పండగను చేసుకోవడానికి భార్య, పాపతో కలిసి చెన్నైకి వెళ్లారు సంతోశ్​. పండగ తర్వాత ఆదివారం ఉదయం తిరిగి బెంగళూరుకు చేరుకున్న సంతోశ్​ కుటుంబం.. ఇంటికి బయలుదేరింది. ఉదయం ఆరు గంటల సమయంలో బెంగళూరు వైట్​ఫీల్డ్​లోని కడుగోడి ఫుట్​పాత్​పై నడుస్తూ వెళ్తున్నారు.

అయితే, ఇంటికి వెళ్తున్న క్రమంలో ఫుట్​పాత్​పై అప్పటికే విద్యుత్ తీగ తెగిపడి ఉంది. ఈ విద్యుత్​ తీగను గమనించని సౌందర్య.. వైర్​పై కాలువేసింది. దీంతో కరెంట్​ షాక్​ తగిలి.. సౌందర్యతో పాటు 9నెలల చిన్నారి చనిపోయారు. ఆమె భర్త సంతోశ్​.. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వారిని రక్షించే క్రమంలో మృతురాలి భర్త సంతోశ్​ సైతం విద్యుత్ ​షాక్​కు గురయ్యారు. దీంతో అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

"చెన్నై నుంచి బెంగళూరు వచ్చిన కుటుంబం ఆదివారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో చీకట్లో కడుగోడి ఫుట్​పాత్​పై పడి ఉన్న విద్యుత్ ​వైరును గమనించకుండా కాలు వేయడం వల్ల షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో సౌందర్య అనే మహిళ సహా తొమ్మిది నెలల చిన్నారి మృతిచెందారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించినందుకు.. సంబంధిత అసిస్టెంట్ ఇంజినీర్ చేతన్, జూనియర్ ఇంజినీర్ రాజన్న, ఆపరేటర్ మంజునాథ్​లపై ఐపీసీ 304ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం."

--డా.శివకుమార్ గునారే, వైట్​ ఫీల్డ్ డివిజన్ డీసీపీ

ఆ ఎముకలు శ్రద్ధావే.. DNA నివేదికలో వెల్లడి.. త్వరలో హత్య సీన్​ రీక్రియేట్​!

మంత్రి కోడలు ఆత్మహత్య! ఆ వ్యవహారమే కారణం!!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.