ETV Bharat / bharat

నరేంద్ర గిరి మరణానికి ఆ ఫొటోనే కారణమా?

అనుమానాస్పద రీతిలో మృతిచెందిన మహంత్​ నరేంద్ర గిరి((narendra giri maharaj) సూసైడ్​ నోట్​గా పేర్కొంటున్న లేఖలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. శిశ్యుడు ఆనంద్​ గిరి బెదిరింపులే మహంత్​ ఆత్మహత్యకు కారణమా? నరేంద్ర గిరి అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లుగా ఫొటోను ఎడిట్​ చేసి ఆనంద్​ గిరి (anand giri) బెదిరించాడా? పోలీసులు ఏం అంటున్నారు?

narendra giri news
నరేంద్ర గిరి మరణానికి ఆ ఫొటోనే కారణమా?
author img

By

Published : Sep 22, 2021, 1:08 PM IST

మహంత్​ నరేంద్ర గిరి (narendra giri maharaj) ఆత్మహత్య కేసులో రోజుకో కోణం బయటపడుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆత్మహత్య లేఖపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 'చదువు రాని వ్యక్తి సూసైడ్​ నోట్​ రాస్తారా?' అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్య లేఖలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఫొటోతో బ్లాక్​మెయిల్!

నరేంద్ర గిరి మృతికి కారణం ఓ ఫొటో అని తెలుస్తోంది. ఈ విషయం ఆయన తన సూసైడ్​ నోట్​గా పేర్కొంటున్న లేఖలో ఉంది. తను ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లుగా ఫొటోను (narendra giri photo) ఎడిట్​ చేసి ఆనంద్​ గిరి (anand giri) బెదిరించేవాడని మహంత్​ అందులో ఆరోపించారు. 'ఒకసారి ఈ పుకార్లను పుట్టించాక ఎంత మందికి మీ నిజాయతీని నిరూపించుకుంటారు' అని ఆనంద్​ గిరి బ్లాక్​మెయిల్​ చేసే వాడని లేఖలో చెప్పుకొచ్చారు.

అయితే.. ఈ కోణాన్ని పోలీసులు ఖండిస్తున్నారు.

ఆ నిర్ణయాలే కారణమా?

నరేంద్ర గిరి ఆత్మహత్యపై (narendra giri news) అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్​ చేస్తున్నారు మహంత్​ అనుచరులు.. తాజాగా ఆయన మరణం వెనుక పెద్ద కుట్రే జరిగిందని ఆరోపిస్తున్నారు. మహంత్​ మృతికి కారణం కేవలం ఒకరు, ఇద్దరు కాదని.. ఎంతోమంది కలిసి ఈ కుట్ర పన్నినట్టు ఆరోపించారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన తీసుకున్న పలు నిర్ణయాల పట్ల అనేక మంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయిందని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రతీకార చర్యగా వారు నరేంద్ర గిరిని హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

గురు-శిష్యుల వైరం..

ఈ కేసులో ప్రధానంగా అందరి దృష్టి ఆయన శిష్యుడైన ఆనంద్​ గిరిపైనే ఉంది. నరేంద్ర గిరిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద్​ గిరి.. మహంత్​ నరేంద్ర గిరిల మధ్య వైరం ఇప్పటిది కాదు.

నిరంజనీ అఖాడా నుంచి వచ్చిన ఆనంద్​ గిరి.. 2000లో నరేంద్ర గిరి (anand giri prayagraj) దగ్గర శిష్యరికంలో చేరాడు. 2005 నాటికి బాంగాబరి మఠంలో చేరాడు. ఈ క్రమంలో మహంత్​ నరేంద్ర గిరికి ప్రియ శిష్యుడిగా మారాడు ఆనంద్​ గిరి. గురువు ఆరోపణలు చేయడం వల్ల 2012లో తొలిసారిగా నరేంద్ర గిరి-ఆనంద్​ గిరిల మధ్య వైరం ఏర్పడింది. బాంగాబరి మఠానికి చెందిన రెండున్నర ఎకరాల స్థలాన్ని నరేంద్ర గిరి.. సమాజ్​వాదీ పార్టీకి చెందిన నేతకు రూ.40 కోట్లకు విక్రయించారని ఆనంద్​ గిరి ఆరోపించాడు. ఆ తర్వాత 2019లో ఆశిష్​ గిరి అనుమానాస్పద మృతి వెనుక కూడా మహంత్​ హస్తం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఆనంద్​ గిరిపై కేసులు..

మహిళలను లైంగికంగా వేధించినందుకు గానూ ఆనంద్​ గిరి.. 2019లో ఆస్ట్రేలియాలో (anand giri australia) అరెస్ట్​ అయ్యాడు. 2016, 2018లో జరిగిన ఈ రెండు వేర్వేరు ఘటనల్లో ఆనంద్​ గిరి.. 29 ఏళ్ల మహిళను, 34 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

మహంత్​ నరేంద్ర గిరి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో ఆధారంగా ఆనంద్​ గిరి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

అంత్యక్రియలు..

బుధవారం ఉదయం పోస్ట్​మార్టం పూర్తయిన నేపథ్యంలో మహంత్​ అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తున్నారు.

d
మహంత్​ సమాధికి ఏర్పాట్లు
d
మహంత్​ సమాధికి ఏర్పాట్లు

మహంత్​ మృతదేహాన్ని అఖిల భారతీయ అఖాడా పరిషత్ సభ్యులు భూమి సమాధి చేయనున్నారు.

ఇదీ చూడండి : దళిత బాలుడు ప్రవేశించాడని గుడిని శుభ్రం చేసిన అగ్రకులస్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.