ETV Bharat / bharat

దిల్లీలో కరోనా మృత్యుఘోషకు కారణాలివే!

author img

By

Published : May 5, 2021, 5:01 AM IST

దిల్లీలో కరోనా మహమ్మారి.. మరణ మృదంగం మోగిస్తోంది. తొలుత అంతంత మాత్రమే ఉన్న కేసులు, మరణాలు.. ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం ఒక్కరోజే 400 మందికిపైగా వైరస్​తో చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అసలు దేశ రాజధానిలో కొవిడ్​ మృత్యుఘోషకు కారణాలేంటి?

covid deaths in Delhi
దిల్లీలో కరోనా మరణాలు

దేశ రాజధాని దిల్లీలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నిత్యం 400మందికిపైగా కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 448 మంది మృత్యువాతపడ్డారు. అయితే, ఇవి కేవలం ఆసుపత్రుల్లో చనిపోయినవారి లెక్కలు మాత్రమేనని.. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని దిల్లీకి చెందిన వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దేశ రాజధానిలో కరోనా మహమ్మారి మరణ మృదంగానికి కొన్ని కారణాలను వారు విశ్లేషిస్తున్నారు.

ప్రధాన కారణాలు ఇవే..

దిల్లీలో విస్తృత వ్యాప్తి కలిగిన కొత్తరకం వైరస్‌లు, క్లిష్టమైన కేసుల్లో చికిత్స అందించేందుకు సరిపోయేంత మౌలిక సదుపాయాలు లేకపోవడం, ముఖ్యమైన ఔషధాలను ముందస్తుగా ఇళ్లలో దాచుకోవడం వంటి అంశాలు దిల్లీలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించడానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. చాలా ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడిన దృష్ట్యా ఆసుపత్రుల బయట వేచిచూసి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వీటికి అదనమని చెబుతున్నారు. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వైరస్‌ ఒక్కటే కారణం కాదు..

తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను చికిత్స అందించేందుకు సరిపడా మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే అధిక మరణాలకు కారణమని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ జుగల్‌ కిశోర్‌ పేర్కొన్నారు. కొవిడ్ మరణాలకు వైరస్‌ ఒక్కటే కారణం కాదని.. సరిపడా సదుపాయాలు, వనరులు లేకపోవడమే ప్రధాన కారణమని విశ్లేషించారు. ఓ వైపు అత్యవసర వైద్యం అందించాల్సిన కేసుల సంఖ్య పెరుగుతుండగా.. వారికి సరిపడా పడకలు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి: పీఎం కేర్స్​ నిధులతో 500 మెడికల్​ ఆక్సిజన్​ ప్లాంట్లు

ఇలా ఆసుపత్రులకు వచ్చే మార్గంలో లేదా పడక కోసం ఆసుపత్రి బయట వేచిచూస్తూ కొందరు రోగులు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు మాత్రం ఆక్సిజన్‌ అందక మృత్యువాతపడినట్లు డాక్టర్‌ కిశోర్‌ వెల్లడించారు. "అత్యవసర చికిత్స అందిచాల్సిన రోగులు దాదాపు 10 నుంచి 20 రోజులు ఐసీయూలో లేదా ఆక్సిజన్‌ సహాయంతో చికిత్స తీసుకుంటారు. ఇదే సమయంలో చికిత్స కోసం వచ్చే వారిసంఖ్య మరింత పెరిగడం, వారికి ఐసీయూ, ఆక్సిజన్‌ లభించడం లేదు. ఇక అత్యవసర సమయాల్లో వినియోగించే ఔషధాలు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడం లేదా చాలామంది ముందస్తుగా ఇళ్లల్లో తెచ్చిపెట్టుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారింది" అని కిశోర్‌ తెలిపారు.

ఐసీయూ, ఆక్సిజన్‌ అందక..

వైరస్‌ నిర్ధారణ అయిన వ్యక్తుల్లో కొందరు 14 నుంచి 15రోజుల అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించామని దిల్లీలోని బట్రా ఆసుపత్రి డైరెక్టర్‌ సుదాన్షు బంకాటా వెల్లడించారు. ఇలా ఈ రోజు ఎక్కువ కేసులు నమోదయ్యాయంటే వచ్చే 14నుంచి 15రోజుల్లో వారిలో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. ఆసుపత్రుల్లో పడకల కొరత కారణంగా అధిక ఆక్సిజన్‌ అవసరమైన చాలా కేసుల్లో ఎక్కువ మంది ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్నారు. వారికి ఆసుపత్రుల్లో పడకలు లభ్యమయ్యే సమయానికి వారి ఆరోగ్య పరిస్థితి విషమించిపోతున్నట్లు డాక్టర్‌ సుదాన్షు అభిప్రాయపడ్డారు.

కేసులు పెరగడం మరో కారణం..

ఇక రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా 8వేలు నుంచి 25వేలకు చేరడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమని జైపూర్‌ గోల్డెన్‌ ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డీకే బలూజా పేర్కొన్నారు. 'ఇలాంటి పరిస్థితుల్లో సిబ్బంది, వైద్య సదుపాయాలు అందరికీ అందేలా చూడడం ఇబ్బంది కావడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. కేసులు పెరుగుతున్నంత వేగంగా వైద్య సదుపాయాల సామర్థ్యం పెరగకపోవడం. తీవ్రత ఎక్కువ కావడానికి కారణమవుతోంది' అని బలూజా పేర్కొన్నారు. ఇలా భిన్న కారణాల వల్ల దిల్లీలో కొవిడ్‌ మరణాల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే, దిల్లీలో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి ఇప్పటివరకు 17వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోగా.. కేవలం గడిచిన రెండు వారాల్లోనే 5వేల మంది మృత్యువాతపడటం గమనార్హం. గడిచిన మూడు రోజులుగా నిత్యం అక్కడ 400లకు పైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మరణించిన వారిసంఖ్య 2లక్షల 20వేలు దాటింది.

ఇదీ చూడండి: కన్నడనాట కరోనా విలయం- మహారాష్ట్రలో మృత్యుఘోష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.