ETV Bharat / bharat

అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసోం పర్యటనలో షా

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. శుక్రవారం రాత్రి అసోం చేరుకున్నారు. రెండు రోజుల పాటు అసోం, మణిపుర్​లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసోంలోని పలువురు కాంగ్రెస్​ నాయకులు.. షా పర్యటనలోనే భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది.

author img

By

Published : Dec 26, 2020, 6:03 AM IST

అసోం పర్యటనలో అమిత్​ షా

వచ్చే ఏడాది జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది భాజపా. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. శుక్రవారం రాత్రి రాష్ట్రానికి చేరుకున్నారు. గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్​ షా కు ఘనస్వాగతం లభించింది. వివిధ రంగాల జానపద కళాకారులు స్థానిక సంప్రదాయాల్లో.. నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ స్వాగతం పలికారు.

More Cong leaders likely to join BJP during Shah's northeast visit
సంప్రదాయ నృత్యాలు
అసోం పర్యటనలో అమిత్​ షా

రెండు రోజుల పాటు అసోం, మణిపుర్​లో పర్యటించనున్న అమిత్​ షా.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. గువాహటిలో రూ. 860 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాల, ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. అసోం వ్యాప్తంగా 11 న్యాయ కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. సీఎం సర్బానంద సోనోవాల్​.. షా తో పాటు వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.

మణిపుర్​లోనూ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆదివారం సాయంత్రానికి తిరిగి దిల్లీ బయల్దేరనున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్నికల సన్నద్ధత.. చేరికలే లక్ష్యం..

అసోం అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే సన్నద్ధత ప్రారంభించింది భాజపా. ఈ మేరకు 16 మందితో కూడిన రాష్ట్ర ఎన్నికల కమిటీని నియమించింది అధిష్ఠానం. ముఖ్యమంత్రి సోనోవాల్​, ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్​ హిమంత బిశ్వ శర్మ, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రంజీత్​ కుమార్​ దాస్​ ఇందులో ఉన్నారు. ఇంకా 17 మంది సభ్యులతో కోర్​ కమిటీ, ఐదుగురితో క్రమశిక్షణ చర్యల కమిటీని నియమించింది.

అసోం పర్యటనలో అమిత్​ షా.. ఈ కమిటీలతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇంకా రాష్ట్రంలో అధికార కూటమిలోని ఇతర పార్టీలతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

షా పర్యటనలోనే కొంతమంది కాంగ్రెస్​ అసంతృప్త నేతలు.. భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు పార్టీ అసోం బాధ్యులు పాండా తెలిపారు. అరుణాచల్​ ప్రదేశ్​లో శుక్రవారం ఆరుగురు జేడీయూ నేతలు భాజపాలో చేరిన నేపథ్యంలో.. అప్రమత్తమైన కాంగ్రెస్​ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. పార్టీ సభ్యులను అప్రమత్తం చేసింది.

ఇదీ చూడండి: 'మిషన్​ 200' కోసం అమిత్ షా కొత్త స్కెచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.