Monthly Assistance Scheme for Women in Tamilnadu : మహిళలకు నెలకు వెయ్యి రూపాయల సాయం అందించే పథకాన్ని ప్రారంభించింది తమిళనాడు ప్రభుత్వం. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ ఐకాన్, దివంగత నేత సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించారు తమిళనాడు సీఎం ఎమ్కే స్టాలిన్. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం' పేరుతో.. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఈ సాయాన్ని అందించనుంది డీఎమ్‌కే ప్రభుత్వం.
కాంచీపురం జిల్లాలో అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు స్టాలిన్. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. అన్నాదురై జయంతి రోజున, కరుణానిధి శతజయంతి తరుణంలో ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వ కారణమన్నారు. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం'.. విప్లవాత్మకమైనదని ఆయన అభివర్ణించారు. ఇది రాష్ట్ర మహిళల జీవితాల్లో పునరుజ్జీవనానికి దారి తీస్తుందని వివరించారు.
"ఇంటి పెద్ద అయిన మహిళకు సంవత్సరానికి రూ.12వేలు ఇస్తున్నాం. ఈ పథకం వారికి ఎంతో భరోసాను ఇస్తుంది. ఇది అభివృద్ధికి చిహ్నం. 'కలైంజ్ఞర్ మహిళల హక్కుల పథకం' మహిళల జీవన ప్రమాణాలను పెంచుతుంది. వారిని ఆత్మగౌరవంతో బతికేలా చేస్తుంది. పేదరికాన్ని రూపు మాపుతుంది." అని స్టాలిన్ పేర్కొన్నారు.
-
VIDEO | Tamil Nadu CM @mkstalin launches Kalaignar Magalir Urimai Scheme, offering Rs 1,000 monthly assistance to women family heads. pic.twitter.com/JfcUDlNIMe
— Press Trust of India (@PTI_News) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Tamil Nadu CM @mkstalin launches Kalaignar Magalir Urimai Scheme, offering Rs 1,000 monthly assistance to women family heads. pic.twitter.com/JfcUDlNIMe
— Press Trust of India (@PTI_News) September 15, 2023VIDEO | Tamil Nadu CM @mkstalin launches Kalaignar Magalir Urimai Scheme, offering Rs 1,000 monthly assistance to women family heads. pic.twitter.com/JfcUDlNIMe
— Press Trust of India (@PTI_News) September 15, 2023
ఈ పథకంలో భాగంగా మొత్తం 1కోటి 6లక్షల 50వేల మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ వెయ్యి రూపాయల సాయం నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. 2023 జులై నుంచి క్యాంపులు ఏర్పాటు చేసి.. అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు-2021 సందర్భంగా.. తన పార్టీ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రకటించింది డీఎమ్‌కే పార్టీ.
శుక్రవారం కాంచీపురం వెళ్లిన ముఖ్యమంత్రి స్టాలిన్.. అన్నాదురై 115 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలైంజర్ మహిళల హక్కుల పథకాన్ని ప్రారంభించారు. 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎమ్‌కే) పార్టీని స్థాపించారు అన్నాదురై. కాచీపురం ఆయన స్వస్థలం. 1967 నుంచి 1969 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు అన్నాదురై.
Udhayanidhi Stalin On BJP : 'బీజేపీ ఓ 'విషసర్పం'.. వెళ్లగొట్టాలంటే ముందు ఆ పార్టీ పని పట్టాలి!'