Mongoose Friendship with Man: ఎవరైనా కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు. కానీ కేరళ కొజికోడ్కు చెందిన అబ్దుల్ గఫూర్ మాత్రం ఓ ముంగిసను పెంచుకుంటున్నాడు. గాయాలతో ఉన్న ముంగిస పిల్లను చూసిన గఫూర్.. దానిని పెంచుకునేందుకు తీసుకువచ్చాడు. ఆ ముంగిసకు పాలు పోసి పెంచాక.. తమతో ఓ కుటుంబ సభ్యునిగా కలిసిపోయిందంటున్నాడు.
"కొన్ని నెలల క్రితం మూడు ముంగిస పిల్లలు ఉన్నాయని నా భార్య చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా.. ఒక ముంగిసను పిల్లి చంపేసింది. మరొకటి గాయాలతో ఉంది. మూడో ముంగిస కనిపించలేదు. గాయపడ్డ ముంగిసనుఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి, పాలు పోశాం. మొదట్లో అది నన్ను కొరికేందుకు ప్రయత్నించేది. పిల్లుల నుంచి రక్షించేందుకు 10 రోజులు బోనులో ఉంచాం. పదిహేను రోజుల పోషించాక.. అది మాతో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. నేను పడుకోవడానికి వెళ్లగానే వస్తుంది. నా చెవులను కొరుకుతుంది. మార్కెట్ వెళ్లినా నా వెంటే వస్తుంది. నా స్నేహితులు ముంగిసను ఇస్తే రూ.20 వేలకు పైగా చెల్లిస్తామని చెప్పారు. ఆ డబ్బులతో నేను ముంగిసను కొనుక్కోలేనని అనుకున్నాను. ముంగిసతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. పుట్టిన వారం నుంచి అది మాతోనే ఉంటుంది."
--అబ్దుల్ గఫూర్
ముంగిస ఇంటి చుట్టుపక్కల వాళ్లతో, పిల్లలతో ఆడుకుంటూ.. ముంగిస సరదాగా గడుపుతోందని అంటున్నాడు గఫూర్. ఈ ముంగిసతో కలిసి మార్కెట్కు వెళితే చాలు.. ఫొటోలు దిగడానికి అనేక మంది క్యూ కడుతున్నారని చెబుతున్నాడు. ఎంతోమంది కొత్తవారు వచ్చిన దానితో ఆడుకునేందుకు యత్నించినా.. ఈ ముంగిస ఎవరికీ హాని చేయలేదని అంటున్నాడు గఫూర్.
"నేను అటవీ కార్యాలయానికి వెళ్లినపుడు.. ముంగిసను డబ్బాలో పెట్టి తీసుకురావాలని అధికారులు చెప్పారు. కానీ అది చాలా పెద్దది అని చెప్పా. ఎవరికైనా హాని కలిగిస్తే తమకు సమాచారం అందించాలని అధికారులు చెప్పారు. కానీ అది ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదు. నా కుటుంబ సభ్యులతో, మా చుట్టు పక్కల వారితో కూడా సరదాగా ఆడుకుంటుంది."
--అబ్దుల్ గఫూర్
ఇదీ చదవండి: రాజస్థాన్ టు దిల్లీ.. 50గంటల్లో 350కి.మీ పరుగు.. ఆర్మీ అభ్యర్థి నిరసన!