ETV Bharat / bharat

'70ఏళ్లుగా లూటీ, ఇది కాంగ్రెస్ మనీహీస్ట్'- రూ.351 కోట్లపై మోదీ సెటైర్లు - ఒడిశా కాంగ్రెస్​ ఎంపీ మద్యం కుంభకోణంపై మోదీ

Money Heist BJP Congress Issue : ఒడిశాలోని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు సంస్థల్లో పట్టుబడ్డ నగదును వెబ్​ సరీస్​ మనీ హీస్ట్​తో పోల్చారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీ ఉండగా కల్పితమైన వెబ్‌ సిరీస్ ఎందుకని ఎద్దేవా చేశారు. మరోవైపు స్వాతంత్ర్యం వచ్చిన దేశంలో జరిగిన అతిపెద్ద డబ్బు దోపిడీ గురించి వివరించండంటూ కాంగ్రెస్ స్పందించింది.

Money Heist BJP Congress Issue PM Modi Reaction On Odisha Liquor Scam Issue
Money Heist BJP Congress Issue
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 6:23 PM IST

Updated : Dec 12, 2023, 6:31 PM IST

Money Heist BJP Congress Issue : కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు సంస్థల్లో పట్టుబడిన రూ.353 కోట్లకుపైగా నగదును ప్రధాని నరేంద్ర మోదీ పాపులర్ వెబ్‌ సిరీస్ మనీ హీస్ట్‌తో పోల్చారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా కల్పితమైన, ఊహాజనితమైన మనీ హీస్ట్‌ వెబ్‌ సిరీస్‌ ఎందుకని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

  • In India, who needs 'Money Heist' fiction, when you have the Congress Party, whose heists are legendary for 70 years and counting! https://t.co/J70MCA5lcG

    — Narendra Modi (@narendramodi) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

70 ఏళ్లుగా ఆ పార్టీకి చెందిన దొంగలు దోచుకుంటునే ఉన్నారని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ సమర్పించు డబ్బు దోపిడీ అనే క్యాప్షన్‌తో బీజేపీ షేర్‌ చేసిన వీడియోపై ప్రధాని ఈ మేరకు స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో బీజేపీ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో దిగిన ఫొటోలతో పాటు మనీ హీస్ట్‌లో ఉన్న ఓ పాత్రకు రాహుల్‌ ఫొటోతో మార్ఫ్ చేసింది.

  • देशवासी इन नोटों के ढेर को देखें और फिर इनके नेताओं के ईमानदारी के 'भाषणों' को सुनें... 😂😂😂

    जनता से जो लूटा है, उसकी पाई-पाई लौटानी पड़ेगी, यह मोदी की गारंटी है।

    ❌❌❌💵 💵 💵❌❌❌ pic.twitter.com/O2pEA4QTOj

    — Narendra Modi (@narendramodi) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదివరకు కూడా సాహు వ్యవహారంపై ప్రధాని స్పందించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ హామీ అని ట్వీట్ చేశారు. కాగా, మనీహైస్ట్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో థ్రిల్లింగ్‌గా సాగే వెబ్‌సిరీస్ అది.

అతిపెద్ద మనీ హీస్ట్​ గురించి చెప్పండి : కాంగ్రెస్​
మరోవైపు, ప్రధాని మోదీ ట్వీట్​పై కాంగ్రెస్ స్పందించింది. 1947 తర్వాత భారత్​లో జరిగిన అతి పెద్దదైన డబ్బు దోపిడీ గురించి ప్రజలకు మోదీ వివరించాలంటూ వ్యాఖ్యలు చేసింది. అదానీ గ్రూప్​-హిండెన్​బర్గ్​ వ్యవహారాన్ని ఉదాహరిస్తూ విమర్శించింది. బీజేపీ నుంచి అదానీ గ్రూప్ లబ్దిపొందిందని ఆరోపించింది. అదానీ గ్రూప్ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రధాని మోదీ ఎక్స్​లో అలా పోస్ట్ చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఎక్స్​ వేదికగా ఆరోపించారు.

  • Dear @narendramodi

    The nation wants you to explain the biggest “money heist” since 1947 👇🏽

    🔻Your close friend Adani siphons out ₹17,500 crore from India by inflating the prices of imported coal and power equipment.

    🔻He brings another ₹20,000 crore back into India via…

    — Jairam Ramesh (@Jairam_Ramesh) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సాహు కంపెనీలో భారీ నగదు లభ్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయన నుంచి వివరణ కోరింది. అది ఆయన ప్రైవేటు వ్యవహారమని, పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. అయితే ఆయన కాంగ్రెస్‌ ఎంపీ అయినందున అంత మొత్తం ఎలా వచ్చిందో అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని ఆదేశించింది.

పేద జంటలకు పెళ్లిళ్లు చేయించిన ట్రాన్స్​జెండర్​- భిక్షాటన ద్వారా వచ్చిన సొమ్ముతో సాయం

అయ్యప్ప దర్శనం కాకుండానే తిరుగుపయనం! శబరిమలలో విపరీతమైన రద్దీతో భక్తుల ఇబ్బందులు

Last Updated : Dec 12, 2023, 6:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.