భారత ప్రధాని నరేంద్ర మోదీ(Modi news).. ప్రతి ఏడాది తన ఆస్తుల (PM Modi Assets) వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు. 2020లో రూ. 2.85 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తుల విలువ రూ. 22 లక్షలు పెరిగి.. 3 కోట్ల 7 లక్షల రూపాయలకు (Narendra Modi net worth 2021) చేరింది. ఈ మేరకు తన తాజా డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
చాలా మంది కేంద్ర మంత్రుల్లానే మోదీకి (Modi net worth) కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు లేవు. ప్రభుత్వం నుంచి పొందే రూ.రెండు లక్షల జీతమే ఆయనకు ముఖ్య ఆదాయ వనరు. దాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం, వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల ఆయన ఆదాయంలో వృద్ధి ఎక్కువగా కనిపిస్తోందని తెలుస్తోంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(రూ.8.9 లక్షలు), ఎల్ఐసీ పాలసీలు(1.5 లక్షలు), ఎల్&టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌లో మోదీకి (Modi net worth)(2012లో రూ. 20 వేలకు కొనుగోలు చేశారు) పెట్టుబడులు ఉన్నాయి.
గుజరాత్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో మోదీ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ విలువే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ విలువ రూ. 1.6 కోట్లు ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి అది రూ. 1.86 కోట్లకు చేరింది.
'మోదీకి(PM Modi Assets) సొంత వాహనం కూడా లేదు.'
ప్రధాని (Narendra Modi net worth 2021) దగ్గర ఇంకా ఏమేం ఉన్నాయంటే.. (2021 మార్చి 31 నాటికి)
- మోదీ వద్ద నాలుగు బంగారపు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ లక్షా 48 వేల రూపాయలు.
- బ్యాంక్ బ్యాలెన్స్ (Modi bank balance) రూ. 1.5 లక్షలు.
- నగదు రూపంలో రూ. 36 వేలు ఉన్నాయి.
2014లో ప్రధాని అయినప్పటినుంచి ఇప్పటివరకు మోదీ (PM Modi assets) ఎలాంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయలేదు. 2002లో కొనుగోలు చేసిన ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ విలువ రూ. 1.1 కోట్లుగా ఉంది. అయితే ఇది ఉమ్మడి ఆస్తి. మరో ముగ్గురికి ఇందులో వాటా ఉంది.
వాజ్‌పేయీ నుంచి మొదలు..
ప్రజాజీవితంలో పారదర్శకత కోసం ఆస్తుల వెల్లడి ప్రక్రియను.. 2004లో అటల్ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి వివిధ హోదాల్లోని రాజకీయ నేతలు వారి ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో నామినేషన్ దాఖలు సమయంలో కూడా అఫిడవిట్‌లో ఈ వివరాలను పొందుపర్చుతారు. ఇక లోక్‌పాల్, లోకాయుక్త చట్టం(2013) ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వారి వార్షిక ఆదాయాన్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
ఇవీ చూడండి: Modi Gift: కమలా హారిస్‌కు మోదీ అపూర్వ కానుక
PM Gift Auction: వేలానికి మోదీ స్వీకరించిన కానుకలు, మెమెంటోలు