దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి(Janmastami 2021) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలంతా ఉదయం నుంచే ఇస్కాన్ ఆలయాలకు((Iskcon temples) ) చేరుకుని వాసు దేవునికి పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు(President wishes) తెలిపారు.
"జన్మాష్టమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని జీవిత బోధనలను తెలుసుకోవడానికి, ఆచరించడానికి ఈ పండుగ ఓ మంచి అవకాశం. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం నింపాలని కోరుకుంటున్నాను."
-రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్రపతి.
మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm modi wihes), ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaih naidu wishes) కూడా దేశ ప్రజలకు ట్విట్టర్ వేదికగా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
"ఈ పవిత్రమైన రోజున మనమంతా మన విధులను చిత్త శుద్ధితో నిర్వర్తిద్దాం. ధర్మమార్గంలో నడుద్దాం. ఈ జన్మాష్టమి మన దేశంలో శాంతి, శ్రేయస్సును నింపుతుంది."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణల నడుమ రాధా కృష్ణులు.. భక్తులకు దర్శనమిచ్చారు.
అటు నోయిడాలోని ఇస్కాన్ దేవాలయంలో.. కృష్ణుడి జన్మాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తి గీతాలతో ఆలయాధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శ్రావణ మాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగును నల్లనయ్యకు నైవేద్యంగా సమర్పించి.. భక్తులు తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
ఇదీ చూడండి: Ayodhya News: 'శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదు'